Liquor shops: భాగ్యనగరంలోని మందు బాబులకు ఇది షాకింగ్ న్యూసే అని చెప్పవచ్చు. ఏప్రిల్ 12 వ తారీఖున హనుమాన్ జయంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ మహానగరంలో అన్ని మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు నగర కమీషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్లుండి హైదరాబాద్ మహా నగరమంతా జై హనుమాన్ నినాదాలతో మార్మోగనుందని.. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోవద్దని పోలీసులను ఆయన ఆదేశించారు.
మద్యం దుకాణాలు, బార్లతో పాటు కల్లు కాంపౌండ్ లను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన శ్రీరామ నవమి సందర్భంగా కూడా మద్యం దుకాణాలు మూతపడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 13వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మద్యం దుకాణాలను మూసివేయాలని నగర కమీషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జంట నగరాల్లోని మద్యం దుకాణాల యజమానులు తప్పనిసరిగా ఈ ఆదేశాలను పాటించాలని ఆయన చెప్పారు. లేని పక్షంలో చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ హెచ్చరించారు.
గత ఆదివారం శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలో మద్యంపై ఆంక్షలు విధించిన విషయ తెలిసిందే. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ పోలీసులు నిషేధం విధించారు. దీంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలంతా చాలా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలో హనుమాన్ జయంతిని కూడా భక్తులు ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా.. ఎలాంటి వివాదాలు తావు లేకుంలడా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ALSO READ: NTPC Recruitment: డిగ్రీతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జీతమైతే రూ.71,000, మరి ఇంకెందుు
ALSO READ: Mega Job Fair: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 8,000 ఉద్యోగాలకు తెలంగాణలో మెగా జాబ్ మేళా..