మామిడిపండ్ల సీజన్ వచ్చేసింది. వాటికోసం ఏడాదంతా ఎదురుచూసేవారు ఎంతోమంది. మామిడి పండ్లు చాలా తియ్యగా రుచిగా ఉంటాయి. అందుకే వీటిని పండ్ల రారాజుగా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు ఉన్నాయి. ఇవి కిలో మూడు లక్షల రూపాయలు. వీటిని ‘ఎగ్ ఆఫ్ ది సన్’ అని కూడా పిలుచుకుంటారు. ఈ పండును కేవలం ధనవంతులు మాత్రమే తింటూ ఉంటారు. దీన్ని పెంచడం చాలా కష్టం. అందుకే ఈ మామిడి మొక్కలు చాలా అరుదుగా పెరుగుతూ ఉంటాయి.
ఏ దేశానికి చెందినవి
ఖరీదైన ఈ మామిడి పండ్లు మియాజాకి జాతికి చెందినవి. ఇది రూబీ ఎరుపు రంగులో మెరుస్తూ ఉంటాయి. అందుకే సూర్యుని పేరు దీనికి పెట్టారు. జపాన్ నుండి వచ్చిన ప్రత్యేకమైన మామిడిపండ్లు ఇవి. 20వ శతాబ్దంలో వీటిని అభివృద్ధి చేశారు. ఒక్కొక్క పండు 350 నుంచి 550 గ్రాముల బరువు ఉంటుంది. ప్రత్యేకమైన తీపి రుచులు కలిగి ఉంటుంది. దీనిలో చక్కెర కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. దీని నుంచే వచ్చే వాసన నోరూరుస్తుంది. ఒక్కసారి మీ మియాజాకి మామిడి పండ్లు తింటే జీవితంలో మర్చిపోలేరు.
ఇండియాలోనూ…
మియాజాకి పండ్లు జపాన్ నుండి అన్ని దేశాలకు ఇప్పుడు చేరుతున్నాయి. కానీ అక్కడ పండించడం మాత్రం కష్టతరంగా మారుతుంది. ఎంతో మంది వాటిని రుచి చూసేందుకు కొనుక్కొని తీసుకువెళ్తున్నారు. అలాగే మన దేశానికి కూడా మియాజాకరి పండ్లు చేరుకున్నాయి. ఇప్పుడు ఒక రైతు ఆ పండ్లను పండిస్తున్నారు. 2021లో బీహార్ లోని ధకానీయ గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ అనే రైతు జపాన్ నుండి రెండు మియా జాకీ మొక్కలను తీసుకొచ్చాడు. వీటిని తన మామిడి తోటలో వేసి పండించారు.
మొదటి ఏడాదికే అవి 21 మామిడి పండ్లను ఇచ్చాయి. మన దేశంలో ఖరీదైన మామిడి పండ్లను పండిస్తున్న వ్యక్తి అతనే. వాటిని కాపాడేందుకు ప్రత్యేకంగా మనుషులను, కుక్కలను కూడా పెట్టారు. అయినా సరే ఈ పండ్లు ఒకసారి దొంగతనానికి గురయ్యాయి. ఈ 21 మామిడి పండ్లు దాదాపు కోటి రూపాయలకు పైగా అమ్ముడుపోయాయి. వీటిని ముందుగానే బుక్ చేసుకొని కొనుక్కునేవారు ఉన్నారు. ఈ మియాజాకి మామిడి పండ్లను ఎవరు పడితే వారు పండించలేరు. అందుకే ఇవి చాలా అరుదైనవిగా మారాయి.
మామిడి పండ్లల్లో ఖరీదైనవి కోహితూర్ రకం పండ్లు. వీటిని ఒకప్పుడు చక్రవర్తులు ఇష్టంగా తినేవారని అంటారు. వీటి ఒక్కో పండు ఖరీదు మూడు వేల రూపాయల నుంచి, పన్నెండు వేల రూపాయల వరకు ఉంటుంది. పాకిస్థాన్ లోని సింథ్ ప్రాంతంలో సింధ్రి మామిడి రకం ఖరీదైనది. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీని ఖరీదు కూడా వేల రూపాయల్లో ఉంటుంది.నూర్జహాన్ మామిడి పండ్లు కూడా ఖరీదైనవి. ఒక్కో మామిడి పండు చాలా బరువుగా ఉంటాయి. ఒక్కోటి మూడున్నర కిలోల బరువు ఉంటాయి. ఒక పండు ముగ్గురికి సరిపోతుంది. ఆల్ఫోన్సో మామిడి కూడా అద్భుతంగా ఉంటుంది. దక్షిణ గుజరాత్ లో ఇవి పండిస్తారు. కిలో పండ్లు పదిహేను వందల రూపాయల వరకు ఉంటాయి. అంటే ఒక్క పండు అయిదు వందల రూపాయలు ఉంటాయి.
Also Read: ఇంట్లో లాఫింగ్ బుద్ధా ఉంటే నిజంగానే మీ అదృష్టం మారుతుందా?
ప్రపంచంలో అత్యంత తియ్యనైన మామిడి పండ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా?
ఖరీదైన పండ్ల గురించి తెలుసుకున్నారు సరే. మామిడి పండ్లలో అత్యంత తియ్యనైన మామిడి పండ్లు తినాలని ఉందా? అయితే, మీరు తప్పకుండా ఫిలిప్పీన్స్ వెళ్లాల్సిందే. కారాబావో అనే మామిడి పండు ప్రపంచంలోనే అత్యంత తియ్యనదని చెబుతుంటారు. ఈ మామిడి పండును ఫిలిప్పీన్ లేదా మనీలా మామిడి పండ్లని కూడా పిలుస్తుంటారు. దీన్ని ఒక్కసారి టేస్ట్ చూశారంటే.. ఎప్పటికీ మరిచిపోలేరట.
1995లో ఈ పండు గిన్నీస్ బుక్ రికార్డులకు కూడా ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత స్వీటేస్ట్ మ్యాంగోగా గుర్తింపు పొందింది.