BigTV English

Secunderabad News: రూ.5 లక్షలు దారి దోపిడీ – కట్ చేస్తే.. ఫిర్యాదు చేసినోడే ‘దొంగ’

Secunderabad News: రూ.5 లక్షలు దారి దోపిడీ – కట్ చేస్తే.. ఫిర్యాదు చేసినోడే ‘దొంగ’

Secunderabad News: సికింద్రాబాద్, బోయిన్ పల్లి ఠాణా పరిధిలో జరిగిన దారిదోపిడి కేసును బోయిన్ పల్లి పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి రూ.5లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు చెందిన రూ.5 లక్షల నగదు తీసుకువెళుతున్న అరుణ్ డబ్బులు కాజేసే యత్నం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. విచారణలో భాగంగా అరుణ్ కుమార్ పోలీసులకు తప్పుగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


పోలీసుల వివరాల ప్రకారం.. ఓ సంస్థకు చెందిన రూ.5 లక్షల నగదు తీసుకువెళుతున్న అరుణ్ డబ్బులు కాజేసే యత్నం చేశాడు.  పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నకిలీ ఫిర్యాదు చేశాడు. అరుణ్ కుమార్ అనే వ్యక్తి సంస్థలో గత కొన్ని రోజుల నుంచి ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నాడు. విచారణలో భాగంగా అరుణ్ కుమార్ పోలీసులకు తప్పుగా ఫిర్యాదు చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి..


హైదరాబాద్ లోని బోయినపల్లి ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, డీఐ సర్దార్ నాయక్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని గ్లోబల్ యాడ్స్ రేబాన్ట్  సంస్థలో మేనేజర్‌గా ఒడిశా రాష్ట్రానికి చెందిన బిక్రమ్ బెహరా, అసిస్టెంట్ మేనేజర్ గా సత్య పాండా, అరుణ్ కుమార్ ఆఫీస్ బాయ్‌గా గత కొన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు. వీరందరు సికింద్రాబాద్, బోయిన్ పల్లిలోనే నివాసం ఉంటున్నారు. అయితే, మూడు రోజుల క్రితం.. గ్లోబల్ యాడ్స్ రేబాన్ట్  సంస్థకు చెందిన రూ. 5 లక్షలను అసిస్టెంట్ మేనేజర్ సత్య పాండాకు ఇవ్వమని మేనేజర్  బిక్రమ్ బెహెరా ఆఫీస్ బాయ్ అరుణ్ కుమార్‌‌ కు చెప్పాడు.

అయితే, అరుణ్ కుమార్ రూ.5లక్షలు కాజేసే యత్నం చేశాడు. ఆ ప్లాన్ లో భాగంగానే పోలీసులకు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో MMR గార్డెన్ ఎదురుగా సర్వీస్ రోడ్డులో తనిఖీల పేరుతో పోలీసు డ్రెస్స్ లో  ఇద్దరు వ్యక్తులు ఉండి నన్ను ఆపారు.  డ్రైవింగ్ లైసెన్స్,  అలాగే ఆర్సీ కూడా అడిగార. నా బ్యాగును చెక్​ చేసి అందులోని రూ. 5 లక్షలు తీసుకొని పోలీస్ స్టేషన్‌కు రావాలని ఇద్దరు వ్యక్తులు హెచ్చరించారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు’ అని అరుణ్ కుమార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.

ఆఫీస్ భాయే అసలు దొంగ

అనంతరం జరిగిన విషయాన్ని అంతా గ్లోబల్ యాడ్స్ రేబాన్ట్  సంస్థలో మేనేజర్‌ బిక్రమ్ బెహరాకు చెప్పాడు.. మేనేజర్‌‌  పోలీస్ స్టేషన్‌కు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయాలు బయటపడ్డాయి. అసలు దొంగ అరుణ కుమార్ అనే తేలింది. సంస్థకు చెందిన రూ.5 లక్షల నగదు తీసుకువెళుతున్న అరుణ్ డబ్బులు కాజేసే యత్నం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. విచారణలో భాగంగా అరుణ్ కుమార్ పోలీసులకు తప్పుగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ALSO READ: Bank Jobs: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్.. అప్లై చేస్తే చాలు..

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×