BigTV English

Manoj Bharathiraja: శోకసంద్రంలో డైరెక్టర్.. గుండె పోటుతో కన్న కొడుకు మృతి

Manoj Bharathiraja: శోకసంద్రంలో డైరెక్టర్.. గుండె పోటుతో కన్న కొడుకు మృతి

Manoj Bharathiraja: తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా ఇటీవల కన్నుమూశారు. 48 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్‌తో మనోజ్ కన్నుమూశారు. ముందుగా హార్ట్ ఎటాక్ రావడంతో మనోజ్‌ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే కన్నుమూశారు. దీంతో కోలీవుడ్‌లోని ప్రముఖులు మనోజ్ భారతీరాజా మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. తండ్రి భారతీరాజా పెద్ద దర్శకుడు కాగా.. తన కుమారుడు అయిన మనోజ్ భారతీరాజా యాక్టర్‌గా పలు తమిళ చిత్రాల్లో మెరిశారు. తన యాక్టింగ్‌తో చాలామందిని మెప్పించి కోలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు.


హీరోయిన్‌తో వివాదం

భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా సినిమాల్లో నటుడిగా చేయడంతో పాటు ఒక సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు సాధించిన నందన అనే నటిని తను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. 1999లో విడుదలయిన ‘తాజ్ మహాల్’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు మనోజ్ భారతీరాజా. అలా డెబ్యూ మూవీతోనే తనకు హీరోగా మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత తనకు హీరోగా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. తన తండ్రి భారతీరాజా (Bharathiraja) దర్శకత్వంలో కూడా పలు సినిమాల్లో హీరోగా నటించాడు మనోజ్ భారతీరాజా.


మల్టీ టాలెంటెడ్

మనోజ్ భారతీరాజా హీరోగా నటించిన మొదటి సినిమా ‘తాజ్ మహాల్’లో పాట కూడా పాడి అందరినీ మెప్పించారు. అలా నటుడిగా, సింగర్‌గా మాత్రమే కాకుండా తన తండ్రి లాగా డైరెక్షన్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2023లో ‘మర్గరి తింగల్’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు మనోజ్. యూత్‌ఫఉల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో తన తండ్రి భారతీరాజాను డైరెక్ట్ చేశారు. అలా తండ్రికి తగిన వారసుడిగా తన వర్క్‌తో పలుమార్లు ప్రేక్షకులను మెప్పించారు మనోజ్ భారతీరాజా. అందుకే ఆయన లేని లోటు కోలీవుడ్‌లో నిలిచిపోతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ప్రేక్షకులు సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Also Read: నాకు ఆ వ్యాధి ఉంది, కానీ ఎవ్వరికీ తెలియనివ్వలేదు.. సీనియర్ నటి స్టేట్‌మెంట్

ఓటీటీలో కూడా అడుగు

మనోజ్ భారతీరాజా (Manoj Bharathiraja) చివరిగా ‘విరూమాన్’ అనే సినిమాలో కనిపించారు. కార్తీ హీరోగా నటించిన ఈ మూవీలో ఒక చిన్న పాత్రలో కనిపించి అలరించారు. సినిమాల్లో నటుడిగా, డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ భారతీరాజా.. ఓటీటీ వరల్డ్‌లోకి ఎంటర్ అయ్యారు. 2024లో అమేజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్‌గా తెరకెక్కిన ‘స్నేక్స్ అండ్ లాడర్స్’ అనే వెబ్ సిరీస్‌లో మహాలింగం అనే పాత్ర చేశారు. హీరోగా సక్సెస్ అయిన తర్వాత కొన్నాళ్లకే యాక్టింగ్ మానేసినా కూడా వెండితెరకు ఎప్పుడూ పెద్దగా దూరంగా లేరు మనోజ్. సందర్భం వచ్చినప్పుడల్లా సినిమాల్లో చిన్న పాత్రలు అయినా చేయడానికి వెనకాడలేరు. అలా చనిపోయే ముందు వరకు ఆయన నటుడిగా అలరిస్తూనే ఉన్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×