BigTV English

Laughing Buddha: ఇంట్లో లాఫింగ్ బుద్ధా ఉంటే నిజంగానే మీ అదృష్టం మారుతుందా?

Laughing Buddha: ఇంట్లో లాఫింగ్ బుద్ధా ఉంటే నిజంగానే మీ అదృష్టం మారుతుందా?

నవ్వుతూ పెద్ద బొజ్జతో ఉండే లాఫింగ్ బుద్ధ పిల్లలకు ఎంతో ఇష్టం. చాలామంది ఇళ్లల్లో ఇలా లాఫింగ్ బుద్ధను పెట్టుకుంటూ ఉంటారు.  దీన్ని అదృష్టానికి చిహ్నంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడూ నవ్వుతున్న ముఖం… సానుకూల శక్తిని ప్రసరింప చేస్తుందని, అందుకే ఇంట్లోనూ, పని చేసే కార్యలయంలో శుభం కలగాలంటే లాఫింగ్ బుద్ధాను ఏర్పాటు చేసుకోవాలని చెబుతారు. ఇది ఎంతవరకు నిజమో, లాఫింగ్ బుద్ధా అదృష్టాన్ని ఎలా తీసుకొస్తుందో తెలుసుకుందాం.


లాఫింగ్ బుద్ధా ఎవరు?
లాఫింగ్ బుద్ధా పదవ శతాబ్దంలోని చైనాకు చెందిన ఒక బౌద్ధ సన్యాసి. ఆయన దయగా ఉండేవారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేవారు. అడిగిన వారందరికీ దానధర్మాలు చేసేవారు. అతను చెరగని చిరునవ్వుతో ఉండేవారు. అందుకే ఆ కాలంలో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. కాలక్రమంగా ఆయన రూపం ఆనందానికి, శ్రేయస్సుకు, జ్ఞానానికి చిహ్నంగా మారిపోయింది. అప్పటినుంచి లాఫింగ్ బుద్ధా విగ్రహాలు సానుకూల శక్తికి, ఆనందానికి, అదృష్టానికి చిహ్నాలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. జీవితంలో నిజమైన ఆనందం కావాలంటే భౌతిక సుఖాలలో కాదని ఇతరులపై దయ చూపడంలో, ధర్మాలు చేయడంలో, సంతృప్తిగా జీవించడంలో ఉంటుందని లాఫింగ్ బుద్ధా చెప్పారు.

ప్రతికూల శక్తి ఉండదు
లాఫింగ్ బుద్ధ చిరునవ్వుకే కాదు.. లోతైన ఆధ్యాత్మిక, తాత్మిక నమ్మకాలకు కూడా ఉదాహరణగా చెప్పుకుంటారు. ఆయన నవ్వు భౌతిక కోరికల నుండి బాధల నుండి విముక్తి పొందిన ఒక పరిపూర్ణ ఆత్మను సూచిస్తుందని అంటారు. ఫెంగ్ షూయ్ సూత్రాల ప్రకారం లాఫింగ్ బుద్ధా ఉన్నచోట ప్రతికూల శక్తి ఉండదని చెబుతారు. అందుకే ఇంట్లో లాఫింగ్ బుద్ధను కచ్చితంగా పెట్టుకోవాలని చెబుతారు. అలాగే ఉద్యోగంలో కూడా ఆనందంగా ఉండాలంటే లాఫింగ్ బుద్ధాను మీరు పని చేసే చోట ఉంచుకుంటే మంచిది.


ఫెంగ్ షూయ్ ప్రకారం ఇంట్లో లాఫింగ్ బుద్ధాని సరైన దిశలో ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. అదృష్టం దక్కుతుంది. ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. మానసిక శాంతితో పాటు కుటుంబ సామరస్యం కూడా బాగుంటుంది. నవ్వుతున్న లాఫింగ్ బుద్ధా విగ్రహం ఇంటి వాతావరణాన్ని తేలికగా, ఆనందంగా మారుస్తుంది. ఇది ప్రతికూలతలను తొలగించి ఇంట్లో సంతోషం వెళ్లి విరిసేలా చేస్తుంది.

ఇంట్లో ఎక్కడ పెట్టాలి
లాఫింగ్ బుద్ధను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించి ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతాయని అంటారు. అలాగే లివింగ్ రూమ్ లో, మీరు పని చేసే కార్యాలయంలో కూడా ఉంచడం వల్ల విజయం, పురోగతికి మార్గం తెరుచుకుంటుందని చెబుతారు.

లాఫింగ్ బుద్ధాలు మార్కెట్లో రకరకాల భంగిమల్లో దొరుకుతాయి. బ్యాగ్ మోసుకొని లాఫింగ్ బుద్ధా ప్రయాణాలు శుభంగా జరిగేలా, సంపద దక్కేలా, బాధలు తొలగించేలా చేస్తాడు. అలాగే ఒక గిన్నె పట్టుకుని లాఫింగ్ బుద్ధా విగ్రహం పెట్టుకుంటే ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించేలా చేస్తాడు. బంగారు నాణాలతో ఉన్న లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెట్టుకుంటే అతను సంపదను, ఆర్థిక శ్రేయస్సును అందిస్తాడని అంటారు. ఇక చేతిలో ఫ్యాన్ పెట్టుకున్న లాఫింగ్ బుద్ధుడు ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించి అదృష్టాన్ని తీసుకువస్తాడని అంటారు.

Also Read: వైఎస్‌ జగన్‌ మళ్లీ జైలుకు వెళ్తారా? కొత్త  సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉందో తెలుసా?

లాఫింగ్ బుద్ధాను ఎప్పుడు నేలపై ఉంచకూడదు. కొంత ఎత్తులోనే ఉంచాలి. అలాగే వంటగది, డైనింగ్ హాల్, బెడ్ రూమ్, టాయిలెట్లకు దగ్గరగా దీన్ని ఉంచకూడదు. ప్రధాన ద్వారానికి 30 అంగుళాల పైన ఉంచాలి. తలుపులు తెరవగానే ఇంట్లోకి ప్రవేశించే వారికి ఈ లాఫింగ్ బుద్ధ కనిపించాలి. అలా కనిపించడం వల్ల వారితో పాటు వచ్చే ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×