Nalleru Benefits: ప్రకృతిని ఆధునికులు సరిగ్గా పట్టించుకోరు కానీ.. ప్రతి మొక్కలోనూ ఎన్నో విలేవైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిల్లో నల్లేరు కూడా ఒకటి.. తాగ జాతికి చెందిన దీన్నే వజ్రవల్లి, అస్థి సంహారక, అస్థి సంధని, అస్థి సంధాన అని కూడా పిలుస్తారు. పట్టణ వాసులతో పోలిస్తే గ్రామీణ వాసులకు చాలా వరకు వీటిపై అవగాహన ఉంటుంది. గుబురు పొదల్లో, డొంకల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, కఫ దోషాలను నియంత్రిస్తుంది. ఈ మొక్క ఔషధ ప్రయోజనాల కారణంగా ఇరోగ్య పరిరక్షణలో ప్రముఖ స్థానంలో ఉంది. ఇది అనేక రోగాలను సంజీవనిలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నల్లేరు తీగ వల్ల కలిగే లాభాలు గ్రామల్లో ఉండే వారికి ఈ మొక్కపై అవగాహన ఎక్కువ. నల్లేరులో కాల్షియం, విటమిన్ సీ, సెలీనియం, క్రోమియం, విటమిన్ బీ, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
కఫ దోషాల నియంత్రణ
ఆయుర్వేదంలో, నల్లేరు వాత, పిత్త, కఫ దోషాలను నియంత్రణలో ఉంచే శక్తి కలిగి ఉందని చెబుతారు. ఇది శరీరంలోని వాతాన్ని తగ్గించి, కఫాన్ని సరిచేస్తుంది. పిత్తానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ ఔషధం ఉపయోగించబడుతుంది. దీని పౌడర్ లేదా రసాన్ని నీటిలో కలిపి తీసుకుంటే, ఈ మూడు దోషాలను సమతుల్యం చేడయడంలో ఉపకారం చేస్తుందని చెబుతున్నారు.
ఎముకల దృఢత్వం
నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సీ, కాల్షియమ్, సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచటమే కాకుండా ప్రక్కన వుండే కండరాల కూడా శక్తినిస్తుంది. విరిగిన ఎముకలు సులభంగా అతుక్కుంటాయి. దీనిలో నొప్పి నివారణ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులోని ఔషధగుణం నొప్పి నివారణకు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు.
జ్వరాలను తగ్గిస్తుంది
నల్లేరు జ్వరాలు తగ్గించడంలో సహాయపడే ఒక సహజ యాంటీ పైరేటిక్‌గా పనిచేస్తుంది. దానిలోని చల్లని లక్షణాలు శరీర వేడిని తగ్గిస్తాయి. చిన్నపాటి ఫీవర్లు లేదా వాతావరణ మార్పుల వల్ల వచ్చిన జ్వరాలకు దీని డికాషన్ (కషాయం) చేయడం ద్వారా తగ్గుముఖం పడుతుంది. నల్లేరు రసం లేదా కషాయాన్ని తాగడం వల్ల తక్కువ టైఫాయిడ్ వంటి లక్షణాలపై కూడా మెరుగైన ప్రభావం ఉంటుందని చెబుతారు. అలాగే ఇది శరీరంలోని ద్రవాల సమతులత్యను పెంచడంలో సహాయపడుతుంది. వేసవి కాలంలో లేదా అధిక వ్యాయామం తర్వాత ద్రవాలను కోల్పోతున్నప్పుడు దీని కషాయం తాగడం ద్వారా శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. దాంతోపాటు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపేందుకు సహాయపడుతుంది.
మానసిక ప్రశాంతత
నల్లేరు తాగడం ద్వారా మానసిక శాంతి పొందవచ్చు. దీని తీయని సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కొన్ని చిట్కాల్లో నల్లేరు చూర్ణాన్ని తలపై రాస్తే తలనొప్పి, ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు. నల్లేరు చూర్ణం లేదా నూనెను మసాజ్ నూనెగా ఉపయోగించడం వల్ల నిద్రలో మెరుగుదల కనిపిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగే హానికర ప్రభావాల నుండి రక్షిస్తాయి. అలాగే ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో కూడా సహాయపడతాయి, తద్వారా వృద్ధాప్య సమస్యలను తగ్గించవచ్చు.
మహిళలకు ఆరోగ్యానికి మేలు
ఇది ముఖ్యంగా మహిళల ఆరోగ్య సమస్యలకు ఒక శక్తివంతమైన ఔషధంగా నిలుస్తుంది. అది నెలసరి సమస్యలు, నొప్పులు, అసమతుల్యాలు వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రసవానికి ముందు, తర్వాత ఆరోగ్య సంరక్షణకు కూడా ఇది సహాయపడుతుందని ఆయుర్వేదంలో ప్రస్తావన ఉంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకు చాలా ప్రయోజనం చేస్తుంది. అజీర్ణం, వాంతులు, గ్యాస్ వంటి సమస్యలకు ఈ మొక్క ద్వారా మెరుగైన చికిత్స పొందవచ్చు. నల్లేరు తిన్న తర్వాత శరీరంలో డీటాక్స్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. పూర్వకాలంలో జీర్ణవ్యాధులు తక్కువ చేయడానికి దీని రసాన్ని తీసుకునేవారు.
Also Read: షాంపూ లేకుండా హెయిర్ వాష్.. వీటితో తలస్నానం చేస్తే మెరిసిపోయే జుట్టు మీ సొంతం
చర్మ సమస్యలు మాయం
నల్లేరు చర్మ సమస్యల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది. ముఖంపై మొటిమలు, దద్దుర్లు, చర్మం ఎండిపోయినప్పుడు దీని రసం ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది చర్మంపై టానిక్‌లా పనిచేస్తుంది. నల్లేరు పేస్టును ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. నల్లేరు అనేది మన శరీరానికి ఆరోగ్యకరమైన మరియు సమగ్రంగా ఉపయోగపడే ఓ ఔషధ మొక్క. దీని సహజ ఔషధ గుణాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తాయి.
చివరగా ఒక్క విషయం దీన్ని కోసినా, కొరికినా దురద వస్తుంది. అందుకోసం కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు.