Viral Video: ఉత్తరాఖండ్‌లోని గోలాపర్ ప్రాంతంలో దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న స్కూటీ.. ముందు నుంచి వస్తున్న బస్సుని బలంగా ఢీ కొట్టింది. స్కూటీ నడుపుతున్న యువకుడు స్పాట్ లో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ ఘటన ఎలా జరిగింది?
స్కూటీ చాలా వేగంగా వస్తోంది. ఆటోను ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సుని ఢీ కొట్టింది. ప్రమాదానికి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో మొత్తమంతా రికార్డు అయ్యింది. స్కూటీ డ్రైవర్ చాలా వేగంగా వాహనాన్ని నడుపుతున్నట్లు కనిపింది. ఘటన జరిగిన వెంటనే సమీపంలోని వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు.
గాయపడిన యువకుడ్ని పైకి లేపడానికి ప్రయత్నించారు. అప్పటికే ఆ వ్యక్తి ఈలోకాన్ని విడిచిపెట్టాడు. ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన తర్వాత స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: అందంగా లేకపోయినా ఐ లవ్యూ చెప్పేసెయ్.. డేటింగ్‌లో న్యూట్రెండ్
ఈ ప్రాంతంలో వాహనాలు నిత్యం వేగంగా వెళ్తున్నాయని, రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి పర్యవేక్షణ ఉండాలని అంటున్నారు. ప్రమాదంలో మృతి చెందిన యువకుడ్ని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం 6.45 నిమిషాలకు జరిగింది.
వాహనం రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటన గురించి తెలియగానే కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైంది. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ పరారయ్యాడు. బస్సుని అదుపులోకి తీసుకుని పోలీసులు, డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
जब रफ़्तार का शौक बना जानलेवा…
हल्द्वानी के गोलापार क्षेत्र में तेज रफ्तार बस और बाइक को जोरदार टक्कर से बाइक सवार की मौके पर ही मौत हो गई। पूरा वाकया सीसीटीवी कैमरे में कैद हो गया है।#Haldwani #Uttarakhand #Accident #CCTV #HindiNews #ABPNews pic.twitter.com/8SCFWpq53e
— SANJAY TRIPATHI (@sanjayjourno) August 25, 2025