ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఆర్థికంగా మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక, ఇంట్లో చెప్తే ఏమంటారోననే భయంతో ఎంతో మంది యువకులు ప్రాణాలు తీసుకున్న ఘటనలను చూశాం. చూస్తేనే ఉన్నాం. కానీ, కొంత మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు డబ్బుల కోసం ఫేక్ ప్రచారాలను చేస్తూ యువతను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమోషన్ల పేరుతో అడ్డగోలు యాప్స్ పరిచయం చేస్తున్నారు. క్షణాల్లో డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటూ అమాయకులను ఆన్ లైన్ రొంపిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.
సన్నీ భయ్యాపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం
ఇక తాజాగా సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ సన్నీ భయ్యా యాదవ్ ఇన్ స్టాలో పోస్టు చేసిన ఓ వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నిప్పులు చెరిగారు. ప్రమోషన్ల పేరుతో అమాయకుల జీవితాలను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సన్నీ భయ్యా.. ఓ యాప్ ప్రమోషన్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను సజ్జనార్, తన ఎక్స్ లో షేర్ చేస్తూ ఫైర్ అయ్యారు. “చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!! అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!! ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!? ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి” అంటూ రాసుకొచ్చారు.
చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!!
అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!!
ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!?
ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా… pic.twitter.com/rFiOeYVzl7
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 24, 2025
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సజ్జనార్ పోస్టు
ఇక సన్నీ భయ్యా యాదవ్ పై సజ్జనార్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సజ్జనార్ వ్యాఖ్యలకు మద్దతుగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. “డబ్బుల కోసం సన్నీ భయ్యా లాంటి వాళ్లు ఎంతగైనా దిగజారేందుకు వెనుకాడరు” అంటున్నారు. “ఇలాంటి దొంగ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపల వేయండి సర్. మీ లాంటి వారే ఇలాంటి వారిని అడ్డుకోవాలి” అని రిక్వెస్ట్ చేస్తున్నారు. “ఇది పచ్చి మోసం అని తెలుస్తూనే ఉంది కదా సర్. అతడి ఐడీ కనుక్కుని యాక్షన్ తీసుకోండి. మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూడండి” అని కోరుతున్నారు. “మా ఊరిలో ఓ అబ్బాయి ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి రూ. 20 లక్షలు అప్పు చేశాడు. దాన్ని తీర్చేందుకు తల్లిందండ్రులు ఉన్న భూమి అమ్మారు. ఎక్కడ కొడుకు చనిపోతాడో అని బాధపడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే అలాంటి వారు ఇబ్బందులు పడరు” అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు.
Read Also: రాహుల్ వల్లే నా పాల క్యాన్ పడిపోయింది, కోర్టుకెక్కిన బీహార్ వ్యక్తి!