VC Sajjanar: సోషల్ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చాక ఏదో రకంగా ఫేమస్ కావాలనే ధోరణి ప్రతిఒక్కరిగి పెరిగిపోయింది. ముఖ్యంగా యువత రకరకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లలో ఆప్‌లోడ్ చేస్తుంటారు. అందులో కొన్ని ఫన్నీగా అనిపిస్తే మరికొన్ని వీడియోలు మాత్రం నెటిజన్స్‌కు ఆగ్రహం తెప్పించేవిగా ఉంటాయి. అలాంటి వాటిలో ప్రాంక్ వీడియోలు ఒకటి. ప్రాంక్ వీడియో చేయడం అనేది ఆ మధ్య ఓ క్రేజ్‌లా మారింది.
కొన్నేళ్ళ ముందు ప్రాంక్ వీడియోలకు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉండేది. సోషల్ మీడియాలో పాపులర్ కావాలనుకున్న వారందరూ ప్రాంక్‌లు చేయటం స్టార్ట్ చేశారు. పాపులర్ అయ్యారు కూడా. అయితే.. ప్రస్తుతం ప్రాంక్‌లకు అంత క్రేజ్ లేకుండా పోయింది. అయినా కూడా కొంతమంది సోషల్ మీడియా పాపులారిటీ కోసం ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. చాలా మంది ప్రాంక్ వీడియోల ద్వారానే ఫేమస్ అయ్యారు. మరికొంత మంది ప్రజల ఆగ్రహానికి గురై దెబ్బలు కూడా తిన్నారు. ప్రాంక్‌ల పేరుతో.. త్వరగా పేరు తెచ్చుకోవాలన్నఆరాటంతో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. కొన్ని సార్లు ప్రాంక్‌లు బ్యాక్ ఫైర్ అవుతూ ఉన్నాయి.
సీరియస్‌గా, నిబద్ధతతో పని చేసుకుంటుంటే.. పనీపాటా లేని పనికిమాలిన వెదవ వచ్చి మీతో ప్రాంక్ వీడియో చేస్తే ఎలా ఉంటుంది? కాలుతుంది కదా..! సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది.. ఓ ఆర్టీసీ కండక్టర్‌కు. ఎవరేమనుకుంటే మాకేం.. మాక్కావల్సింది మా వీడియోకు లక్షల్లో వ్యూస్.. అందుకోసం అడ్డమైన ఫీట్స్ చేస్తాం.. చెప్పు దెబ్బలూ తింటాం.. అన్నట్టుగా నేటి తరం పనిలేని సోషల్ మీడియా పిచ్చోళ్లు వీదుల్లో తిరుగుతున్నారు.
అసలే రద్దీగా ఉన్న బస్.. ఎందరో నిరక్షరాస్యులైన ప్రయాణీకులు ఈ బస్ ఎక్కడికెల్తుంది? అని అడిగితే.. ఓపికతో సమాధానం చెబుతుంటాడు కండక్టర్.. అలాంటి టైమ్‌లో ఓ యువకుడు వచ్చాడు.. ఈ బస్ గుంటూరు పోతుందా? అంటూ కండక్టర్‌ను అడిగాడు.. దానికి కండక్టర్ గుంటూరు పోదు అని సమాధానం ఇచ్చాడు.. అయితే, తన కాలుకు వేసుకున్న చెప్పును మొబైల్ ఫోన్‌లా వాడుతూ.. అవతలి వ్యక్తితో అరే.. ఇది గుంటూరు పోదటరా.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా వీడియో షూట్ చేసి తన సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోగా షేర్ చేశాడు.
Also Read: ముద్దులు పెడుతూ.. డ్యాన్సర్‌తో సరసం.. బీజేపీ నేత వీడియో వైరల్
విధుల్లో ఎంతో బిజీగా ఉన్న ఓ బస్ కండక్టర్‌తో చేసిన ఈ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని TG RTC ఎండీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇదేం వెర్రి కామెడీ!? అంటూ పేర్కొన్నారు. కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని.. ఇలాంటి పిచ్చి వేషాలేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.
ఇదేం వెర్రి కామెడీ!?
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!?
కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం… pic.twitter.com/OBXeqmCZRp
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 15, 2025