SCR Special Trains For Kumbh Mela 2025: ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక సంబురం మహా కుంభమేళా కోసం భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 144 ఏండ్లలో ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగరాజ్ కు తరలి వస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో రైళ్లు నడుపుతున్నది. దేశ వ్యాప్తంగా 13 వేలకు పైగా రైళ్లను షెడ్యూల్ చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఈ రైళ్లు ప్రయాగరాజ్ పరిసర స్టేషన్లకు చేరుకుంటాయి. వీటిలో 10 వేల రెగ్యులర్ రైళ్లు ఉండగా, మరో 3 వేలకు పైగా ప్రత్యేక రైళ్లు ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే నుంచి 180 ప్రత్యేక రైళ్లు
ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు మహా కుంభమేళాకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే 142 ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతుంది. ఇతర జోన్ ల నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ మీదుగా మరో 40 రైళ్లను నడిపిస్తున్నది. ఇక కుంభమేళాకు వెళ్లే ప్రయాణీకులు అవసరమైన సమాచారం అందిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బుక్ లెట్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. “మహా కుంభమేళా సందర్భంగా ఇండియన్ రైల్వే మొత్తం 13 వేలకు పైగా రైళ్లను నడపాలని నిర్ణయించింది. వీటిలో 10 రెగ్యులర్ రైళ్లు ఉన్నాయి. మరో 3 వేల ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి సుమారు 180 రైళ్లు వెళ్తున్నాయి. ఈ రైళ్లన్నీ ప్రయాగరాజ్, దాని చుట్టు పక్కల స్టేషన్స్ వెళ్లేలా ప్లాన్ చేశాం. కుంభమేళాకు దేశ వ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మంది భక్తులను తీసుకెళ్లడానికి భారతీయ రైల్వే ప్రయత్నిస్తున్నది” అని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
IRCTC ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ రైళ్లు
ఇక మహా కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో IRCTC భారత్ గౌరవ్ రౌళ్లను నడుపున్నది. ఇప్పటికే ఓ రైలు జనవరి 19న బయల్దేరగా, మరోకటి ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి బయల్దేరనుంది. వీటిని IRCTC ప్యాకేజీ కింద నడుపుతున్నారు. మొత్తంగా మూడు కేటగిరీలలో రైల్వే బుకింగ్ అందుబాటులో ఉంటుంది. మొత్తం 8 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రయాగరాజ్ లో ఆలయ దర్శనంతో పాటు పుణ్య స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు IRCTC అధికారులు. ప్రయాగరాజ్ లో ఉండేందుకు మంచి సౌకర్యాలతో మహా కుంభ్ విలేజ్ లో ఉండేలా వసతి ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15 భారత్ గౌరవ్ రైలులో కుంభమేళా యాత్రకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: భారతీయ రైల్వేలో అన్ని క్లాస్ లు ఉంటాయా? ఒక్కో క్లాస్ టికెట్ రేటు ఎంత ఉంటుందో తెలుసా?