BigTV English

Groom Money Garland Chase: ధూమ్ మచాలే.. పెళ్లిలో దొంగతనం.. దొంగను పట్టుకోవడానికి పెళ్లికొడుకు కార్ చేజ్..

Groom Money Garland Chase: ధూమ్ మచాలే.. పెళ్లిలో దొంగతనం.. దొంగను పట్టుకోవడానికి పెళ్లికొడుకు కార్ చేజ్..

Groom Money Garland Chase| ప్రపంచంలో ఎన్నో రకాల వింత మనుషులున్నారు. అవకాశం వస్తే చాలు విన్యాసాలు చేస్తుంటారు. చుట్టూ ఏం జరిగినా.. ఎంత మంది చూస్తున్నా అవన్నీ పట్టించుకోకుండా అనుకున్నది చేసేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో పెళ్లి ఉరేగింపులో ఉన్న వరుడు గుర్రాన్ని వదిలి బైక్ పై పరుగుపెట్టాడు. ఇదంతా ఒక దొంగను పట్టుకోవడానికి చేసిన సాహసం. ఆ తరువాత దొంగను పట్టుకోవడానికి సినిమా తరహాలో ప్రమాదకర స్టంట్లు చేశాడు. ఈ దృశ్యాలను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ మీరట్ నగరంలో ఇటీవల ఒక వివాహం జరిగింది. ఉత్తర భారతదేశ సంప్రదాయం ప్రకారం.. పెళ్లికొడుకు గుర్రంపై కూర్చొని బ్యాండు మేళంతో ఊరేగింపుతో వస్తున్నాడు. అంతలోనే ఒక మినీ ట్రక్కు ఆ ఊరేగింపు మధ్యలో నుంచి వెళ్లింది. అయితే ఆ ట్రక్కు డ్రైవర్ వెళుతూ.. పెళ్లికొడుకు మెడలో ఉన్న నోట్ల హారంలో నుంచి కొన్ని నోట్లు లాగేశాడు. ఆ తరువాత వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గుర్రంపై కూర్చొని ఉన్న పెళ్లి కొడుకు కిందకు దిగి ఆ మినీ ట్రక్కుని వెంబడిస్తూ పరుగులు తీశాడు.

Also Read: పెళ్లి ఊరేగింపులో నోట్ల వర్షం.. రూ.20 లక్షలు గాల్లో విసిరేసిన అతిథులు


గ్రే కలర్ సూట్ వేసుకున్న పెళ్లికొడుకు తలపై ఎర్రని తలపాగా ధరించి ఆ ట్రక్కు డ్రైవన్ దొంగని పట్టుకోవడానికి పరుగులు తీస్తుండగా.. వెనుక నుంచి ఒక పాలవాడు బైక్ పై పాలక్యాన్లు పెట్టుకొని అదే దారిలో వచ్చాడు. ఆ పాలవాడి బైక్ పై పెళ్లికొడుకు కూర్చొని దొంగను పట్టుకోవడానికి మినీ ట్రక్కుని వెంబడించారు.

ఈ క్రమంలో ఆ ట్రక్కు డ్రైవర్ వేగంగా నేషనల్ హైవేపైకి వెళ్లిపోయాడు. అయినా పాలవాడి బైక్ పై వెనుక కూర్చొని వరుడు వెంబడిస్తూనే ఉన్నాడు. అలా హైవే పై ట్రక్కుని చేజ్ చేస్తూ.. బైక్ దగ్గరికి వెళ్లగా.. పెళ్లి కొడుకు ఒక్కసారిగా సీటుపై నుంచి లేచి ట్రక్కుపై సినిమా హీరోలా దూకాడు. అంతటితో ఆగక వేగంగా వెళుతున్న ట్రక్కుపై వేలాడుతూ డ్రైవర్ కేబిన్ వరకు చేరుకున్నాడు. ఆ తరువాత సినిమా స్టంట్ చేసి డ్రైవర్ కేబిన్ లోకి ముందు కాళ్లతో ప్రవేశించాడు. ఇంతలో పాలవాడు బైక్ వేగంగా నడిపి ట్రక్కుకి అడ్డంగా వెళ్లాడు. దీంతో ఆ దొంగ.. తన ట్రక్కుని ఆపాల్సి వచ్చింది.

కిందికి దిగగానే పెళ్లికొడుకు ఆ ట్రక్కు డ్రైవర్ ని పిడిగుద్దులతో కొట్టడం ప్రారంభించాడు. వెనుక నుంచి పెళ్లికొడుకు స్నేహితులు కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్లు కూడా ట్రక్కు డ్రైవర్ ని చితకబాదారు.

అప్పుడా ట్రక్కు డ్రైవర్ తాను దొంగతనం చేయలేదని.. కేవలం సరదా కోసం ఒక నోటు లాగానని చెప్పాడు. తనను వదిలేయమని ప్రాధేయపడ్డాడు. అయినా జనం అతడిని చితకబాదారు. ప్రస్తుతానికి పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేయలేదని సమాచారం. అయితే ఈ విన్యాసాల వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఆ నోట్ల హారంలో అన్ని రూ.100 నోట్లు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి రెండు నోట్ల కోసం అంత ప్రమాదకర విన్యాసాలు అది కూడా పెళ్లి రోజు చేయడం అవసరమా అని నెజిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×