Indian Railways: రైలు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే కఠిన చర్యలు తీసుకుంటున్నది. రైల్వే ట్రాక్ లు, రైల్వే స్టేషన్లు, కదులుతున్న రైళ్లలో డేంజరస్ స్టంట్లు చేస్తే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరికలు చేస్తోంది. అయినప్పటికీ, చాలా మంది యువతీ యువకులు పద్దతి మార్చుకోవడం లేదు. రన్నింగ్ ట్రైన్స్ లో డేంజరస్ స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువతి ఏకంగా వేగంగా వెళ్తున్న రైలు ఫుట్ బోర్డు మీద డ్యాన్స్ చేయడం సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా రీల్స్ కోసం కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ కు చెందిన ఓ యువతి కదులుతున్న రైలులో మెట్లపై నిలబడి డేంజరస్ ఫోజులు ఇచ్చింది. బయటకు వేలాడుతూ ప్రాణాలతో చెలగాటం ఆడింది. చివరకు చేతులు వదిలేసి ఫుట్ బోర్డు మీద డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే, మరికొంత మంది ఇలాంటి పనులు చేసేందుకు భయపడతారని కామెంట్స్ పెడుతున్నారు.
యవతి కోసం రైల్వే అధికారుల ఆరా
అటు ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ రైలు ఎక్కింది? ఎక్కడ దిగింది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు యువతిపై రైల్వే చట్టాల ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఆమె పట్టుకుని జైలుకు తరలిస్తామని తమిళనాడు రైల్వే పోలీసులు వెల్లడించారు.
Read Also: రైలుకు బర్త్ డే.. కేక్ కట్ చేసిన సెలబ్రేట్ చేసిన ప్రయాణీకులు!
డేంజరస్ స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న యువత
పలువురు యువతీ యువకులు కదులుతున్న రైళ్లలో డేంజరస్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కొంత మంది యువకులు ఏకంగా రైలు పట్టాల మీద పడుకుంటున్నారు. తమ మీదుగా ట్రైన్స్ వెళ్లే వీడియోలను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరికొంత మంది రన్నింగ్ ట్రైన్స్ కు వేలాడుతూ వెళ్తున్నారు. కొన్నిసార్లు చేతులు జారి రైలు కింద పడి చనిపోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే ట్రాక్స్ తో పాటు రైళ్లు, రైల్వే సంబంధ ప్రదేశాల్లో ఫోటోలు, వీడియోలు, రీల్స్ తీయకూడదని హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రైల్వే చట్టాల ప్రకారం కేసులు నమోదు అయితే, లైఫ్ లాంగ్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని వార్నింగ్ ఇచ్చినా చాలా మందిలో మార్పు రావడం లేదు.
Read Also: గాలి దుమారంలో విమానం, వణికిపోయిన ప్రయాణీకులు, నెట్టింట వీడియో వైరల్!