BigTV English

Viral News: డిజిటల్ అరెస్ట్- కొత్త స్కామ్ కు తెరలేపిన కేటుగాళ్లు, ఆటకట్టించిన నెటిజన్!

Viral News: డిజిటల్ అరెస్ట్- కొత్త స్కామ్ కు తెరలేపిన కేటుగాళ్లు, ఆటకట్టించిన నెటిజన్!

Digital Arrest Scam: సైబర్ నేరగాళ్లు ప్రజలను కొత్త ట్రిక్స్ ప్లే చేస్తూ బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు వరకు బ్యాంక్ కాల్స్, లాటరీ కాల్స్, ఫేక్ ఫేస్ బుక్ ఐడీల ద్వారా మోసం చేసిన కేటుగాళ్లు ఇప్పుడు కొత్తగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ కు తెరలేపారు. నేరుగా వీడియో కాల్ చేసి ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబర్ మిస్ యూజ్ అయ్యాయని బెదిరిస్తారు. కేసు నమోదు అయ్యిందని భయపెడుతారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు చెప్తారు. ఈ కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలని చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఈ కొత్తరకం మోసాన్ని ఓ నెటిజన్ బట్టబయలు చేశాడు. మొత్తం స్కామ్ జరిగే విధానాన్ని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఇటీవలి కాలంలో సైబర్ మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ ను పావుగా వాడుకుంటున్నరు. ఇంతకీ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే? సైబర్ నేరస్తులు అమాయకుల ఫోన్ కు వీడియో కాల్ చేసి మీ ఆధార్ నంబర్ లేదంటే సెల్ ఫోన్ నెంబర్ మిస్ యూజ్ అయ్యింది. వాటి ద్వారా పెద్ద మొత్తంలో ఫ్రాడ్ జరిగింది. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని ఫోన్ లో చెప్పడాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. గత కొంతకాలంగా ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ మోసాన్ని విజయ్ పటేల్ అనే వ్యక్తి బట్టబయలు చేశాడు. కొంత మంది సైబర్ మోసగాళ్లు ఆయనకు కాల్ చేశారు. ఓ పార్శిల్ లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, అది మీ పేరు మీదే ఉందని విషయం మొదలు పెట్టారు. ఆ తర్వాత డబ్బులు ఇస్తే ఈ కేసు నుంచి తప్పిస్తాం అనే వరకు వచ్చారు.


నిజమైన పోలీసుల మాదిరిగా కలరింగ్

సెల్ ఫోన్ కు వీడియో కాల్ చేసే వ్యక్తులు అచ్చం పోలీసుల మాదిరిగానే కనిపిస్తారు. పోలీస్ స్టేషన్ సెటప్ వేసుకుని సైబర్ క్రైమ్ డీసీపీ, ఏసీపీ అంటూ కలరింగ్ ఇస్తారు. వాళ్లు మాట్లాడే మాటలు, చూపించే ఆధారాలు కూడా నిజమేనేమో అనిపిస్తాయి. అందుకే అమాయకులు భయపడి కేసు నుంచి తప్పించాలంటూ అడిగిన మొత్తంలో డబ్బులు ముట్టజెప్పుతారు. తాజాగా అసలు సైబర్ మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎలా బెదిరిస్తారు? అనే విషయాన్ని  స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టెప్ బై స్టెప్ చూపించాడు విజయ్ పటేల్. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని, కేవలం కొంత మంది మోసగాళ్లు ఈ పద్దతితో అమాయకులను బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారని వెల్లడించాడు. ఇలాంటి కాల్స్ కు భయపడకూడదని సలహా ఇచ్చారు.

Read Also: మహిళా ప్యాసింజర్‌ను దోచుకున్న బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.. ఆమె ఫోన్‌లో ఏం చేశారంటే?..

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×