Black Magic Video: యూట్యూబర్లు రకరకాల వీడియోలతో వ్యూస్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్ర విచిత్రమైన వీడియోలు రూపొందిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. కొన్నిసార్లు కొంత మంది యువకులు చేసే పనులు ప్రజలను భయపెట్టేలా ఉంటున్నాయి. తాజాగా కొంత మంది యువకులు రూపొందించిన ఫ్రాంక్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వాళ్లు చేసిన పని చూసి గ్రామస్తులంతా భయంతో వణికిపోయారు.
ఊరి మధ్యలో చేతబడి..
కొంత మంది యువకులు రాత్రిపూట రోడ్డు మీద చేతడి చేసినట్లు వీడియో క్రియేట్ చేశారు. ముందుగా రోడ్డు మీద ముగ్గు వేశారు. దాని మీద నిమ్మకాయలు కోసి, వాటికి పసుపు, కుంకుమ రాశారు. ముగ్గు మధ్యలో ఉంచారు. కొన్ని మిరపకాయలు పెట్టారు. మరికొన్ని చేతబడి కోసం ఉపయోగించే వస్తువులను ముగ్గులో ఉంచారు. అచ్చం చేతబడి చేసినట్లుగానే సీన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. పొద్దునే లేచి ఈ చేతబడి వ్యవహారాన్ని చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోయారు. ఊరి ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. ప్రతివారి ముఖంలో ఆందోళన, భయం కనిపించింది. ఎవరో కావాలని తమను ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రయత్నం చేశారని భావించారు. కొంత మంది ఎవరు చేశారో ఈ చెడు పని అంటూ తీవ్రంగా కోప్పడ్డారు. బూతులు తిట్టారు. తమ కోపాన్ని వెళ్లగక్కారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇక ఈ చేతబడి వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో ‘అవరాబాయ్స్ 5’ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఆ పోస్టుకు ‘కాలా జాదూ’ అనే పేరు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టిన కాసేపట్లోనో బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా లైక్స్ పొందింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఫన్నీగా కామెంట్స్ పెడితే మరికొంత మంది సీనియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. “మీరు చేసిన పని గ్రామ ప్రజలందరికీ భయానికి గురి చేసింది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మీరు ఘనకార్యం చూసి భయపడే వారిలో ఏ ఒక్కరైనా మీ వీడియో చూసి ఉంటే, అప్పుడు మీకు ఉంటుంది” అని ఇంకో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “ఈ పని చేసిన రోజునే ఊళ్లో ఎవరైనా చనిపోయి ఉంటే ఎలా ఉండేది?” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. “చిలిపి పనులు చేయడంతో తప్పులేదు. కానీ, ఇలాంటి విషయాలతో ఆటలు ఆడటం మంచిది కాదు. ఇది చేసింది మీరే అని అక్కడి వాళ్లకు తెలిస్తే నిజంగా చిక్కుల్లో పడటం ఖాయం” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
Read Also: పో*ర్న్ మూవీలో ఆఫర్.. సంతోషం తట్టుకోలేక తల్లికి చెప్పేసిన కొడుకు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?