Aavesham: మలయాళ సినిమాలు ఈ ఏడాది ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసాయి. వరుస హిట్లు. స్టార్ హీరోలు, కొత్త కుర్రాళ్ళు అనే తేడా లేకుండా హిట్స్ మీద హిట్స్ కొట్టేశారు. ప్రేమలు, మంజిమ్మెల్ బాయ్స్, భ్రమ యుగం, ఆవేశం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఆవేశం సినిమా మినహా మిగతా సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. కానీ, ఆవేశం మాత్రం ఇంకా తెలుగు డబ్బింగ్ రాలేదు.
మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ హీరోగా జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఆవేశం సినిమా ఏప్రిల్ 11 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మొదటి నుంచే పాజిటివ్ టాక్ ను అందుకొని రూ. 150 కోట్ల వసూళ్లను అందుకొని వందకోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు. కనీసం ఓటీటీలోనైనా తెలుగు వెర్షన్ పెడతారేమో అనుకున్నారు. కానీ, అది జరగలేదు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా మలయాళ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.
Jagapathi Babu: మొన్న ఓవర్ యాక్షన్ చేశా.. ఇప్పుడు ఒళ్లు బలిసి ఈ వీడియో పెట్టా
అయితే ఎప్పుడెప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తారా.. ? అని అభిమానులు ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఆవేశం.. తెలుగులో డబ్ చేయడం లేదట.. రీమేక్ చేస్తున్నారట. అందుకే ఓటీటీలో కూడా తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంచలేదని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసేసరికి అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. అయితే ఫహాద్ ప్లేస్ ను రీప్లేస్ చేసే నటుడు ఎవరు.. ? అనే చర్చ మొదలయ్యింది. అండర్ వరల్డ్ డాన్ రంగా.. కాలేజీ పిల్లల రక్షణ కోసం తన ఆవేశాన్ని వదిలి ఏం చేశాడు.. ? అనేది ఈ సినిమా కథ.
తెలుగులో అలా బాలెన్స్డ్ గా నటించే హీరో ఎవరు..?. మొదట ఈ పాత్ర బాలయ్య చేస్తే బావుంటుందని మాటలు వినిపించాయి. కానీ, బాలయ్యకు ఈ స్క్రిప్ట్ వర్క్ అవుట్ అవ్వదు అని తేల్చిపడేశారు. కుర్రాళ్ల గొడవలు.. ఆ గెటప్ లో బాలయ్య వారితో ఉండే విధానం సెట్ కాదని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆవేశం స్టార్.. మాస్ మహారాజా రవితేజ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
Amaran – Sugamya Shankar: ముకుంద్ చెల్లి పాత్రలో నటించిన ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?
రవితేజ..RT టీమ్ వర్క్స్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఇందులో మట్టి కుస్తీ, సుందరం మాస్టర్ లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆవేశం రీమేక్ హక్కులను ఈ ప్రొడక్షన్ హౌస్ నే కొనుగోలు చేసిందని తెలుస్తోంది. దీంతో.. ఆవేశం స్టార్ గా రవితేజనే నటిస్తే బావుంటుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
మాస్ మహారాజా ఎనర్జీకి.. ఈ సినిమా మంచిగా సెట్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ రీమేక్ లో రవితేజను మించినవాడిని చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మాస్ మహారాజా.. ఆవేశం స్టార్ గా మారతాడా.. ? ఆవేశం స్టార్ ను ప్రొడ్యూస్ చేస్తాడా.. ? అనేది చూడాలి.