Pawan Kalyan: ఢిల్లీలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. పార్లమెంట్‌లో రేపు ప్రధానమంత్రి మోడీని కలవనున్నారు. ఇవాళంతా బిజీ షెడ్యూల్ ఉంది. ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి షేకవత్ పట్ల తనకు అపార గౌరవం ఉందని తెలిపారు. గతంలో జలశక్తి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు. ఏపీని టూరిజం హబ్బుగా తీర్చిదిద్దెందుకు ప్రయత్నిస్తున్నాం అని పవన్ కళ్యాణ్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఆ దిశగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. గండికోట లాంటి వారసత్వ ప్రాంతాలని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయవచ్చు అని అన్నారు. ఏపీలో పలు కీలక పర్యాటక ప్రాజెక్టులను అమలు చేయబోతున్నాం అని.. ఆ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు గురించి శేఖవత్‌తో చర్చించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన చాలా సానుకూలంగా స్పందించారని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: ఏపీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు
ఇదిలా ఉంటే.. పవన్ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఆ తర్వాత ఒంటి గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3:15కి నిర్మలా సీతారామన్‌తో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇక సాయంత్రం 4:30 గంటలకు రైల్వేశాఖమంత్రి అశ్వినివైష్ణవ్‌తో పాటు, 5:15కి లలన్ సింగ్‌తో పవన్‌కల్యాణ్ సమావేశం జరగనుంది. రేపు జరగబోయో పార్లమెంట్‌లో ప్రధాని మోడీతో భేటీకానున్నారు పవన్ కళ్యాణ్.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పవన్ కల్యాణ్ రూటు మారింది. భాష మారింది. వేషం మారింది. మొత్తంగా.. ఆయన సిద్ధాంతమే మారిపోయింది. దీంతో ఒక విధంగా హిందూ వాదుల్లో ఆయన మైలేజ్ బాగా పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే.. హిందుత్వ ఎజెండానే ఆయన భుజానికెత్తుకున్నారు. తిరుమల వేదికగా చేసిన వారాహి డిక్లరేషన్ తర్వాత.. జనం పవన్ కల్యాణ్ చూసే కోణం మారింది. సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలని.. దేవాలయాల రక్షణకు కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిస్తున్నారు. సనాతన ధర్మ సూత్రాలతో దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతున్న జనసేనాని ఆలోచనలు ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయి. అంతేకాదు.. అవి అద్బుతాలు కూడా సృష్టిస్తున్నాయి. ఏపీని టూరిజం హబ్బుగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.