Viral Video : ఓ కోతి తన కోతి పనితో హల్‌చల్ చేసింది. ఓ టూరిస్టు నుంచి రూ.500 నోట్ల కట్టను లాగేసుకుంది. క్షణాల్లో చెట్టు మీదకు ఎక్కేసింది. అంతే.. మనోడి గుండె గుబేల్ అంది. ఇప్పుడు ఆ నోట్ల కట్ట ఎలా? చిన్న నోట్లు అయితే అతనూ అంతగా టెన్షన్ పడేవాడు కాకపోవచ్చు. రూ.500 నోట్ల కట్ట కావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కోతిని బాబ్బాబు అంటూ బతిమిలాడ సాగాడు. పాపం ఆ కోతి కాస్త మంచిదిలా ఉంది.
ఆ నోట్ల కట్టను చూసి అదేదో తినే పదార్థం అనుకుని ఉంటుందా కోతి. లాక్కెళ్లి వాసన చూసి.. అది ఫుడ్డు కాదు ఎందుకూ పనికి రాని పేపర్ ముక్కలు అని అనుకుని ఉంటుంది. దాంతో అదేం చేసుకుంటుంది? అలాగని వాటిని ఏ ఆట వస్తువుల్లానో చింపేసి పడేస్తే..? కోతికేం తెలుసు అవి విలువైన డబ్బులు అని? ఆ పర్యాటకుడిలో పరేషాన్ ఎక్కువైంది.
చెట్టు మీదున్న ఆ కోతికి నోట్ల కట్టలను ఏం చేయాలో తెలీలేదు. వాటికి రబ్బర్ బ్యాండ్ కూడా వేసి ఉంది. అటూ ఇటూ తిప్పి చూసింది. పేపర్లను ఊపింది. ఆ తర్వాత చెట్టు మీద నుంచి ఆకులను తెంపి పడేసినట్టు.. కట్ట నుంచి ఒక్కో రూ.500 నోటును తీసి.. కిందకు పడేసింది. అలా వరుసగా నోట్లను విసిరేసింది. కట్ట సగం ఖాళీ అయింది. దానికి అదో ఆట అనిపించింది. కిందినుంచి చూస్తు్న్న అతను హమ్మయ్యా అనుకున్నాడు. కోతి పోయాక నోట్లు ఏరుకోవచ్చులే అని కాస్త రిలాక్స్ అయ్యాడు.
అయితే, అప్పటికీ ఇంకొన్ని నోట్లు కోతి చేతిలోనే ఉన్నాయి. తనను ఎవరైనా చూస్తున్నారని అనుకుందో ఏమో.. చటుక్కున మరో వైపునకు తిరిగిపోయింది. అదంతా ఓ టూరిస్టు వీడియో తీశాడు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మిగతా నోట్ల కట్టను ఆ కోతి ఏం చేసిందో ఆ వీడియోలో లేదు.
ఈ ఘటన కొడైకెనాల్‌లోని గుణ గుహల సమీపంలో జరిగిందని అంటున్నారు. కోతి బుద్దులు.. కోతి చేష్టలు అంటే వినడమే కానీ.. ప్రత్యక్షంగా చూసి, ఆ పర్యాటకుడిని టెన్షన్ పడేలా చేసిన ఆ సీన్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దొంగ కోతి అంటూ నెటిజన్లు తెగ పండుగ చేసుకుంటున్నారు.
कोडैकनाल के गुना केव्स के पास एक बंदर ने कर्नाटक से आए पर्यटकों से 500 रुपये के नोटों की गड्डी छीनी और पेड़ पर चढ़कर नोटों को एक-एक कर नीचे फेंक दिया.
यह अनोखा वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है.#Monkey #ViralVideo #Kodaikanal #Karnataka pic.twitter.com/drPQMuSkZN
— बेरोजगार युवा 🙂 (@VVipinpatel) June 16, 2025