AB de Villiers : దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ AB డివిలీయర్స్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతన్ని మిస్టర్ 360 అని పిలుస్తారు. తన పేరిట రికార్డులను క్రియేట్ చేసుకున్నాడు. సిక్సుల మోత మోగించడంలో అప్పట్లో గేల్, డెవీలియర్స్ రికార్డుల కోసం పోటీ పడేవారు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసేవారు. ఇటీవల అతను గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి రిటైర్మెంట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ సందర్భంలు పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు ABD. ముఖ్యంగా నాతో ఆడిన ప్లేయర్లందరూ విష పాముల కంటే డేంజర్ అని చెప్పుకొచ్చాడు. “ముఖ్యంగా నేను ఎవ్వరి పేర్లను చెప్పి వారిని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. కానీ ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టు అప్పట్లో అస్తవ్యస్థంగా ఉండేది. జట్టులో చాలా మంది విష పూరితం గల వ్యక్తులు ఉండేవారు” అని తెలిపాడు.
Also Read : Digvesh Rathi 5 Wickets : దిగ్వేష్ మామూలోడు కాదుగా.. 5 బంతులకు 5 వికెట్స్ తీశాడుగా
ఇక అదే సమయంలో మై హీరోస్ గ్లెన్ మెక్ గ్రాత్, డేనియల్ వెటోరి వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. కొంత మంది ప్రవర్తన వల్ల అనుభవం కొంత వరకు దెబ్బ తిన్నదని తెలిపాడు. మా టీమ్ లో కొందరూ యంగ్ క్రికెటర్లు ఉండేవారు. తనకు తీపి, చేదు అనుభవాల కలయిక ఉంది. ఎందుకంటే తన జీవితంలో కొన్ని మధురమైన క్షణాలు అక్కడే ఉన్నాయి. గ్లెన్ మెక్ గ్రాత్, డేనియల్ వెటోరీలతో గడపడం గొప్ప విషయం. ఇక తరువాత నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి వచ్చాను. ఆర్సీబీ వారు ప్రతీ గేమ్ మంచిగా ఆడాలని కోరుకునేవారు. అందుకు తగ్గట్టే ఆడేందుకు ప్రయత్నించాను. కానీ కొన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించాం. మరికొన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించలేకపోయామని చెప్పుకొచ్చాడు డెవిలీయర్స్. ఢిల్లీ డేర్‌డెవిల్స్ తర్వాత.. ఏబీ డివిలియర్స్ 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరాక కెరీర్ అద్భుతంగా సాగింది. ఏబీడీ బెంగళూరు తరఫున దాదాపు పదేళ్ల పాటు ఆడాడు.
కోహ్లీ-డివిలియర్స్ మాటలు కట్..
మరోవైపు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులకు రెండో సంతానం కలుగబోతుందని ఓ లైవ్ లో పొరపాటున చెప్పినందుకు కోహ్లీ తనతో చాలా నెలల వరకు మాట్లాడలేదని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. “కోహ్లీ-అనుష్క దంపతులకు రెండో సంతానం కలుగబోతుందని పొరపాటున వెల్లడించాను. దీంతో కోహ్లీ నెలల పాటు మాట్లాడలేదు. గత ఆరు నెలలుగా మళ్లీ మా మధ్య మాటలు సాగుతున్నాయి. ఓ రకంగా ఇది ఉపశమాన్ని ఇచ్చి అపరాధభావాన్ని తొలగించింది. కోహ్లీ తో ఎంతో స్నేహం ఉంది. ప్రతీ విషయాన్ని మాట్లాడుకుంటాం. అతన్ని ఇంకా క్రికెట్ మైదానంలో చూస్తూ ఉండటం చాలా ఆనందంగా అనిపిస్తోందని.. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలనే ఆలోచన విరాట్ కోహ్లీ హృదయం వచ్చిందే. వన్డేలలో ఆడగల సత్తా అతనికి ఉంది. కెరీర్ లో చివరి బంతి వరకు ఆస్వాదించాలని విరాట్ కోహ్లీ కి చెప్పా ” అని తెలిపాడు ఏబీ డివిలియర్స్.