Railway track marriage: ఇదొక పెళ్లి తంతు అట. అందరూ వచ్చారు.. దండలు ఎవరికి వారు మారుస్తున్నారు. కానీ పెళ్లి మంత్రాలు వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్లికి వచ్చిన వారు మాత్రం.. వారికై వారే అక్షింతలు చల్లేస్తున్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అదేంటి పెళ్లి జరుగుతుంటే.. పక్కనున్న వారి సందడి ఎక్కువగా ఉంది. నూతన వధూవరుల సందడి ఏం లేదా అనుకోవద్దు. ఎందుకంటే ఇదో వెరైటీ పెళ్లి. అసలు ఈ పెళ్లి ఎవరికి జరిగిందో తెలుసుకుంటే.. ఇట్టే ఆశ్చర్యపోతారు.
అసలు విషయం ఏమిటంటే..
ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ, ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.. పెళ్లి అంటే సహజ పెళ్లి అనుకోవద్దు. ఇదో వెరైటీ పెళ్లి. ఈ పెళ్లి వెనుక అసలు అంతరార్థం ఏమంటే.. ప్రమాదాలు జరగకుండా ఉండాలనట. పెళ్లి ఏమిటి ప్రమాదం ఏమిటి అనుకుంటున్నారా.. ఇక్కడ జరిగిన పెళ్లి తంతు ఎవరికో కాదు. రెండు రైలు పట్టాలకు పెళ్లి చేశారు. అసలు విషయం తెలిసి ఆశ్చర్య పోయారు కదూ.. ఇది నిజం.
ఏ రాష్ట్రంలో జరిగిందో కానీ, ప్రమాదాలు జరగకుండా ఉండాలని రెండు రైలు పట్టాలకు పెళ్లి తంతు నిర్వహించారు అక్కడి స్థానికులు. వీడియో చూస్తే ఎవరైనా అవాక్కవుతారు. ఎందుకంటే సామాన్య పెళ్లి వలె వేదమంత్రాలు చదువుతూ.. రెండు పట్టాలపై పూలదండలు ఉంచి ఈ పెళ్లి తంతు సాగించారు అక్కడి వారు. ఇలా రైలు పట్టాలకు పెళ్లి చేయడం ఏమిటని అనుకుంటున్నారా.. అసలు సంగతి ఇదే. రైలు ప్రమాదం జరగకుండా.. ఇలా పట్టాలకు పెళ్లి తంతు కాని చేసామని అక్కడి వారు చెప్పడం విశేషం.
Also Read: Vande Bharat Bullet Train: జపాన్ బుల్లెట్ ట్రైన్ ఔట్? వందే భారత్ ఇన్.. కిర్రాక్ న్యూస్ అంటే ఇదేనేమో!
ఈ విషయం తెలిసిన స్థానికులు నివ్వెర పోతే, ఇదో రకం పెళ్లి అంటూ కొందరు నవ్వుకుంటూ వెళ్లిపోయారట. ఈ పెళ్లి తంతు మొత్తం వీడియో తీసి, స్థానికులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా క్షణం వ్యవధిలోనే మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో పై భిన్ననరీతిలో కామెంట్స్ సాగిస్తున్నారు. ఇదెక్కడి పైత్యం రా బాబు.. ప్రమాదాలు జరగకుండా పట్టాలకు పెళ్లి చేయడం ఏమిటని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం.. పెళ్లి తంతు సాగించిన వారు ఫేమస్ కావడం కోసం, ఇలా చేశారని తమ వాదన వినిపిస్తున్నారు. అసలే పెళ్లి వయసు వచ్చినా, పెళ్ళి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిన సమయంలో ఇదే వెరైటీ పెళ్లి రా బాబు అంటూ.. మరికొందరు అనేస్తున్నారు. ఏది ఏమైనా రైలు పట్టాలకు పెళ్లి నిర్వహించడం.. ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా దాని వెనుక ఉన్న కారణం కూడా మరో సంచలనంగా మారిందని చెప్పవచ్చు.
కొసమెరుపు ఏమిటంటే.. అచ్చం వధూవరులను ఆశీర్వదించినట్లు, ఆ రెండు రైలు పట్టాలను కూడా అక్కడివారు ఆశీర్వదించి వెళ్లిపోవడం వీడియోలోనే హైలెట్ గా మారింది.
दो पटरी को जोड़ने वाले रेलवे लाइन का आपस मे वरमाला पहनाकर विवाह करवाते हुए कुछ लोग!
इन दोनों पटरियों के विवाह के बाद रेल दुर्घटना होना मुश्किल ही नहीं नामुमकिन है! pic.twitter.com/hspC4H6KJt
— Sadaf Afreen صدف (@s_afreen7) July 10, 2025