కళ్లకు సన్ గ్లాసెస్, లయబద్దంగా చేతుల కదలిక, పురాతన సంప్రదాయంతో 11 ఏళ్ల కుర్రాడు ఇంటర్నేట్ ను షేర్ చేస్తున్నాడు. పడవలో ముందు నిలబడి ఏమాత్రం భయం లేకుండా కాళ్లు, చేతులు కదుపుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అతడే కనిపిస్తున్నాడు. ఆ పిల్లాడు పడవ కొన మీద చేసే నృత్యాన్ని చూసి ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరంటే..
ఇండోనేషియాకు చెందిన రయాన్!
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఆ కుర్రాడు ‘ఆరా ఫార్మర్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి పేరు రయాన్ అర్కాన్ దిఖా అలియాస్ డికా. ఇండోనేషియాలోని రియావు ప్రావిన్స్ లో ఏటా జరిగే సాంప్రదాయ పడవ పందెం పాకు జలుర్ సందర్భంగా అతడు పడవ ముందు భాగంలో ఎలాంటి భయం లేకుండా నిల్చుని నృత్యం చేస్తున్న ఈ వీడియో ఈ ఏడాది ప్రారంభంలో వైరల్ అయ్యింది. టిక్ టాక్ యూజర్ లెన్సా రామ్స్ పోస్ట్ చేసిన ఈ క్లిప్ ఆన్ లైన్ లో హల్ చల్ చేసింది. డికా సాఫ్ట్ సన్ గ్లాసెస్, ప్రశాంతమైన వ్యక్తీకరణ, హిప్నోటిక్ కదలికలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఇట్టే ఆకట్టుకున్నాయి.
రేసులో రోవర్లను ఉత్సాహ పరుస్తూ..
నిజానికి డికా ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. అతడు సంప్రదాయ తుకాంగ్ తారి నృత్యకారుడిగా గుర్తింపు పొందాడు. అతడి పని రేసులో రోవర్లను ఉత్సహపరచడం. ప్రతి పడవకు ఓ తుకాంగ్ తారి ఉంటాడు. కానీ, డికా డ్యాన్స్ ఈ పోటీకే హైలెట్ గా నిలిచింది. డికా 9 సంవత్సరాల వయస్సు నుండి ఇలా చేస్తూ ఉన్నాడు.
Grok 4 remains the world's most advanced and powerful AI model. 😎 pic.twitter.com/lTQrVlsoAm
— SMX 🇺🇸 (@iam_smx) July 14, 2025
ఏకంగా ప్రభుత్వ గుర్తింపు..
డికా వీడియో క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. మీమ్ గా, ట్రెండ్ గా మారిపోయింది. అతడి ప్రదర్శనకు ఏకంగా రియావు ప్రభుత్వం ఫిదా అయ్యింది. అతడిని టూరిజం అంబాసిడర్ గా నియమించింది. అతడి ద్వారా తమ పర్యటకానికి మరింత ప్రచారాన్ని నిర్వహించాలనుకుంటుంది. గవర్నర్ అబ్దుల్ వాహిద్ డికా విద్య కోసం స్కాలర్ షిప్ ను కూడా అందించింది. ఈ వేడుకలో గవర్నర్ తో పాటు డికా స్వయంగా నృత్యం చేశారు.
Read Also: ఇండియన్ రైళ్లలో అత్యంత సేఫ్ బెర్త్.. ఇదే బుక్ చేసుకోండి!
సంతోషం వ్యక్తం చేసిన డికా
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల డికా సంతోషం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ నిర్ణయం తనను చాలా సంతోష పెట్టిందని చెప్పుకొచ్చాడు. “నేను గవర్నర్ ను కలుస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నన్ను టూరిజం అంబాసిడర్ గా నియమించడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం అనుకున్నట్లుగానే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేందుకు నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను” అని చెప్పుకొచ్చాడు.
Read Also: ఈ రోజు నుంచి రైల్వే రూల్స్ మారాయ్.. టికెట్ బుకింగ్స్ లో భారీ మార్పులు!