BigTV English

Vijay Sethupathi : పాపం విజయ్… గెస్ట్ అని పిలిచి అవమానించిన నాగార్జున..?

Vijay Sethupathi : పాపం విజయ్… గెస్ట్ అని పిలిచి అవమానించిన నాగార్జున..?

Vijay Sethupathi : విజయ్ సేతపతి… సినిమా హిట్ అవ్వాలంటే సిక్స్ ప్యాక్ ఉండాలి. హైట్ ఉండాలి.. గ్లామర్‌గా కనిపించాలి అనే మాటలు తప్పు అని, ఫర్మామెన్స్‌తో కూడా సినిమాలను హిట్ చేయొచ్చు అని చేసి చూపించిన హీరో. పేరుకు తమిళ హీరో. కానీ, పాన్ ఇండియా వైడ్ ఈయనకు అభిమానులు ఉన్నారు. అందుకే… ఆయనను బిగ్ బాస్ 8 తెలుగు ఫైనల్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా పిలవాలని అనుకున్నాడు నాగార్జున. నాగార్జున పిలవడంతో… విజయ్ సేతపతి కూడా ఫైనల్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చాడు. గెస్ట్‌గా వెళ్లిన విజయ్‌కు బిగ్ బాస్ ఫైనల్ వేదికపై అవమానం జరిగిందట. గెస్ట్‌గా పిలిచి నాగార్జున అవమానించాడు అంటూ విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్‌లో ఏం జరిగింది..?
విజయ్ సేతుపతికి ఎందుకు అవమానం జరిగింది..?
నాగార్జున్ ఏం చేశాడు..? అనేది ఇప్పుడు చూద్ధాం…


నాలుగు రోజుల క్రితం… డిసెంబర్ 15న బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే జరిగింది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ రియాలిటీ షోకి విన్నర్‌గా నిఖిల్ నిలిచాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. రామ్ చరణ్ చేతులు మీదుగా ఫైనల్‌లో విన్నర్‌గా నిలిచిన నిఖిల్‌కు కప్ ఇచ్చారు. ఇక్కడే విజయ్ సేతుపతికి అవమానం జరిగిందట.

ముందుగా బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ అని విజయ్ సేతుపతి అని అనుకున్నారట. విజయ్ సేతుపతికి కూడా అక్కినేని నాగార్జున కాల్ చేసి గ్రాండ్ ఫినాలే ఉందని, దానికి చీఫ్ గెస్ట్‌గా రావాలని, విన్నర్ కి కప్ ఇవ్వాలని విజయ్ సేతుపతికి చెప్పారట.


ఎలాగూ విడుదల పార్ట్ 2 ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కు రెగ్యులర్‌గా వస్తున్న విజయ్ సేతుపతి వెంటనే ఒకే అన్నారట. అందులోనూ టాలీవుడ్ కింగ్ నాగార్జున ఫోన్ చేసి గెస్ట్‌గా రావాలి అంటే విజయ్ సేతుపతి కాదు అనలేకపోయారని సమాచారం.

దీంతో చీఫ్ గెస్ట్ అని బిగ్ బాస్ 8 తెలుగు సెట్‌కి విజయ్ సేతుపతికి షాకింగ్ విషయాన్ని చెప్పారట బిగ్ బాస్ టీం. ఫైనల్ ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ మీరు కాదు… గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారని విజయ్ సేతుపతికి బిగ్ బాస్ టీం చెప్పారట. దీంతో సెట్ వరకు వచ్చి వెనుతిరగడం ఎందుకు అని… బిగ్ బాస్ టీం చెప్పినట్టు హౌస్ లోకి ఇష్టం లేకుండానే వెళ్లి వచ్చాడట. తర్వాత నాగార్జునతో నార్మల్ గా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేశారట. విజయ్ సేతుపతి వెళ్లిపోయిన తర్వాత చీఫ్ గెస్ట్ రామ్ చరణ్ బిగ్ బాస్ సెట్స్ కి వచ్చారట.

అయితే రామ్ చరణ్ ఫైనల్ ఎపిసోడ్ కి రావడం రావడం కుదరకపోవచ్చని, గేమ్ ఛేంజర్ పనులు, RC16 షూటింగ్, అన్నింటి కంటే ముఖ్యంగా అదేే టైంలో అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూ ఉంది. దీని వల్ల రామ్ చరణ్ రాకపోవచ్చని చీఫ్ గెస్ట్‌గా విజయ్ సేతుపతిని పిలిచారట. కానీ, చివరి అవకాశంగా రామ్ చరణ్ కు స్వయంగా నాగార్జున ఫోన్ చేయడంతో రామ్ చరణ్ రావడం ఖరారు అయిందట. దీంతో ఫైనల్ కప్ ను విజయ్ సేతుపతితో కాకుండా, రామ్ చరణ్ తో ఇప్పించారని తెలుస్తుంది.

ఁఅయితే, చీఫ్ గెస్ట్, కప్ ఇవ్వడం అని చెప్పి పిలిచి బిగ్ బాస్ నుంచి అవమానించి పంపించారని విజయ్ సేతుపతి హర్ట్ అయ్యారట. ఫైనల్ ఎపిసోడ్‌లో విజయ్ సేతుపతి కాస్త డల్‌‌గా కనిపించాడు. దీనికి కారణం కూడా ఇదే అని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారుతుంది. రామ్ చరణ్‌ను చీఫ్ గెస్ట్ పిలవడం తప్పు కాదని, కానీ, విజయ్ సేతుపతికి ఆ విషయం కాస్త ముందు చెప్పి ఉంటే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×