Republic Day Wishes: రిపబ్లిక్ డే సందర్భంగా మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు చక్కగా శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా..? ఇక్కడ ఉన్న కోటేషన్లను వాడుకోవచ్చు. ఇందులో భారత రాజ్యాంగం గురించి అదేవిధంగా గణతంత్ర దినోత్సవం, దాని ప్రాముఖ్యత గురించి ప్రధానంగా వివరించాం. సింపుల్ కొటేషన్లను అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఉండడంతో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. చక్కటి సందేశాలను కేవలం కొన్ని పదాలతోనే వాట్సాప్ ద్వారా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. వీటిని మీరు సోషల్ మీడియాలోని ఏ వేదికపైన అయిన మెసేజ్‌ల ద్వారా షేర్ చేసి పంచుకోవచ్చు. 1950 జనవరి 26న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి మనం ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కొన్ని అద్భుతమైన కొటేషన్లు మీ కోసం..
1. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించి నేటికి 75 ఏళ్లు పూర్తై 76వ ఏటలో అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
2. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సర్వసత్తాక, సార్వభౌమ, గణతంత్ర, ప్రజాస్వామ్య మన మాతృభూమి, భరత భూమి, నమోః నమామి…భారతీయలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
3. సమైక్యత, సౌభ్రాతృత్వం గల అతిపెద్ద ప్రజాస్వామ్యం, భారతీయ రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా పౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
4. రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
5. స్వేచ్ఛాయుత భారతంలో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ భాద్యత తీసుకోవాలని కాంక్షిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
6. గణతంత్ర్య దినోతవ్సవంలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం.. దీని కోసం ఎందరో మహానుభావుల త్యాగం.. మనం ఎప్పటికీ మరవకూడదు.. మీకు మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు 76వ గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..
7. నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నా.. ఎల్లప్పుడూ నేను భారతమాతకు రుణపడి ఉంటా.. భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు
8. ఎల్లప్పుడూ శాంతి, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వ స్ఫూర్తిని నిలబెట్టుకుందాం.. హ్యాపీ రిపబ్లిక్ డే
9. మాతృభూమి కోసం తమ ధన, మాన ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానాభావులు.. వారందరికీ వందనములు.. హ్యాపీ రిపబ్లిక్ డే
10. మూడు రంగల జెండా.. ముచ్చటైన జెండా.. భారతదేశ జెండా.. అందరికీ అండ.. నింగిలో ఎగిరే జెండా.. అందరూ మెచ్చే జెండా.. మనందరిలో ఆశలు రేపిన జెండా..
11. ఎందరో స్వాతంత్ర్య సమర మోధులు, అమర వీరుల ఫలితమే భారతీయుల స్వేచ్ఛ. వారి స్ఫూర్తితో ముందుకు సాగుదాం.. హ్యాపీ రిపబ్లిక్ డే..
12. మన మాతృభూమిని అన్ని దురాచారాల నుండి విముక్తి చేయడానికి మనం చేయగలిగినదంతా చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
13. అమరవీరుల త్యాగ ఫలాలను కొనియాడుతూ.. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు అంకితం కావాలని కోరుతూ గణతత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
14. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం.. అందరికీ గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Also Read: Konda Surekha: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ..
15. ఆంగ్లేయుల దాశ్య సంకెళ్లను వదిలించుకొని భారతదేశం రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్న చారిత్రక రోజు. మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు