కొన్ని వింతలు భలే ఆశ్చర్యం కలిగిస్తాయి. అసలు అలా ఎందుకు జరుగుతుందో చెప్పడం కష్టం. అలాంటి ఓ ఆశ్చర్యకర విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. అదే కోడిని మాయ చేయడం. ఇంకా చెప్పాలంటే కోడిని వశపరుచుకోవడం. కోడి ఏంటి? వశపరుచుకోవడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ స్టోరీ మీరు కచ్చితంగా చదవాల్సిందే!
కోళ్లను పట్టుకోవాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే!
నిజానికి కోళ్ల గూడు నుంచి వదిలిన కోళ్లను పట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. హుస్సేన్ బోల్ట్ లా పరిగెత్తి పట్టుకోవాల్సి ఉంటుంది. పట్టుకున్న కోడిని సన్నని తాడుతో కట్టేయాలి. లేదంటే.. పారిపోతుంది. తాడు లేకుండా, కనీసం చేతితో పట్టుకోకుండా కోడిని కదలకుండా చేయవచ్చు అనేవి విషయం మీకు తెలుసా? తెలియకపోతే, సింపుల్ గా ఈ వీడియో చూడండి.
తల ముందు గీత గీస్తే కదలకుండా ఉండాల్సిందే!
కోడిని పట్టుకున్న తర్వాత దాని తలను నేలకు తగిలేలా ఉంచి నిటారుగా దాని ముక్కు ముందు ఓ గీత గీయాలి. నెమ్మదిగా కోడిని వదిలి పెట్టాలి. కాళ్లు కట్టేయకున్నా, రెక్కలు పట్టుకోకున్నా, కోడి అలాగే కదలకుండా ఉండిపోతుంది. ఎప్పుడైతే కోడి ముక్కు ముందు గీసిన గీత తుడిపేస్తారో.. వెంటనే లేచి పారిపోతుంది. ఒకటి కాదు, ఏ రకమైన కోడిని తీసుకొచ్చి ఈ ప్రయోగం చేసినా, ఇలాగే రిజల్ట్ ఉంది. ఇంతకీ, కోడికి ఆ గీతకు ఉన్న సంబంధం ఏంటి? అనేది చాలా మందికి తెలియదు.
Read Also: విమానంలో షర్టులు విప్పి కూర్చున్న ప్రయాణీకులు.. ఏం చేస్తారు పాపం, పరిస్థితి అలాంటిది!
కోడిపై హిప్నాటిజం..
నిజానికి ఈ రకమైన విధానాన్ని కోడి వశీకరం అంటారు. ఇంకా చెప్పాలంటే, మనుషుల మీద హిప్నాటిజం అనేది ఎలా పని చేస్తుందో, కోళ్ల మీద కూడా అలాగే పని చేస్తుంది. సుమారు అర నిమిషం పాటు ఈ హిప్నాటిజం ప్రభావం ఉంటుంది. నిజానికి ఈ సమయంలో కోడి తలను పట్టుకుని నేల మీద పెట్టడం వల్ల అది ఒకరకమైన ట్రాన్స్ లోకి వెళ్లిపోతుంది. అదే సమయంలో ముక్కు ముందు గీత గీయడం వల్ల అది భయపడుతుంది. అదే సమయంలో ఎటూ కదలకుండా అలాగే ఉండిపోతుంది. ఇక ఆ గీతను ఎప్పుడైతే చెరిపేస్తారో వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. కోడి హిప్నాటైజేషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ మీరూ ఇది నిజమో? కాదో? తెలుసుకోవాలంటే ఓసారి కోడిని పట్టుకుని ట్రై చేయండి. అసలు నిజం ఏంటో తెలిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రయత్నించండి! అన్నట్టు కోళ్లు మాత్రమే కాదు, సొర చేపలు, పాములు కూడా ఇలాగే వ్యవహరిస్తాయి.
Read Also: ఓడియమ్మ.. రోబోలు డాన్స్ చెయ్యడం ఏంటి మస్క్ మామ? నువ్వు తోపు అంతే!