Vaishnavi Chaitanya: ఈరోజుల్లో సినీ సెలబ్రిటీలు ఏం మాట్లాడినా ఏదో ఒక వివాదానికి దారితీస్తుంది. అందుకే స్టేజ్‌పైకి ఎక్కారంటే సెలబ్రిటీలు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. తాజాగా అలా జాగ్రత్తగా మాట్లాడకుండా తనపై, తనతో పాటు ఒక హీరోయిన్‌పై ట్రోల్స్ క్రియేట్ అయ్యేలా చేశాడు నిర్మాత ఎస్‌కేఎన్. కొన్నిరోజుల క్రితం ఒక మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న ఎస్‌కేఎన్ తెలుగమ్మాయిలను హీరోయిన్స్ చేయడం గురించి ప్రస్తావించాడు. దీంతో తను మాట్లాడింది వైష్ణవి చైతన్య గురించే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ‘బేబి’ సినిమా తర్వాత వైష్ణవికి, ఎస్‌కేఎన్‌కు మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే ఆయన అలా మాట్లాడారని అనుకున్నారు. దానిపై వైష్ణవి చైతన్య తాజాగా క్లారిటీ ఇచ్చేసింది.
ఇన్‌డైరెక్ట్ కామెంట్స్
ఆనంద్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రమే ‘బేబి’. ఈ సినిమాను అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించాడు నిర్మాత ఎస్‌కేఎన్. అయినా మూవీ రిలీజ్ అయిన తర్వాత యూత్‌ను విపరీతంగా ఆకట్టుకొని దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా లాభాలు పొందాడు. అంతే కాకుండా ‘బేబి’ సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరో, హీరోయిన్‌తో సమానంగా ఎస్‌కేఎన్ కూడా హైలెట్ అయ్యాడు. ఆయన స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుంటే కచ్చితంగా మీమర్స్‌కు కంటెంట్ ఇస్తాడని నెటిజన్లు సైతం ఫిక్స్ అయిపోయారు. ఒక విధంగా వైష్ణవికి ఇంత స్టార్‌డమ్ రావడానికి ఎస్‌కేఎనే కారణం. అలాంటిది ఆయనే వైష్ణవిపై ఇన్‌డైరెక్ట్‌గా నెగిటివ్ కామెంట్స్ చేశాడని ప్రేక్షకులు ఫీలయ్యారు.
ఎస్‌కేఎన్ క్లారిటీ
ఇటీవల ఒక మూవీ ఈవెంట్‌లో తెలుగమ్మాయిలను అస్సలు ఎంకరేజ్ చేయకూడదు అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు ఎస్‌కేఎన్. తన చివరి మూవీ ‘బేబి’లో హీరోయిన్‌గా నటించిన వైష్ణవి చైతన్య తెలుగమ్మాయే కావడంతో తన గురించే ఎస్‌కేఎన్ ప్రస్తావించాడని అందరూ ఫిక్స్ అయ్యారు. తన స్టేట్‌మెంట్‌పై తానే క్లారిటీ ఇస్తూ ఒక వీడియో విడుదల చేశాడు ఎస్‌కేఎన్. తను ఎలాంటి తప్పు ఉద్దేశ్యంతో ఆ మాట అనలేదని, ఇప్పటికే తాను ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్స్‌గా పరిచయం చేశానని, ఇంకా చాలామందిని చేస్తానని మాటిచ్చాడు. ఇక ఎస్‌కేఎన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై తాజాగా ‘జాక్’ మూవీ ప్రమోషన్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వైష్ణవి చైతన్య స్పందించింది.
Also Read: బొక్కలో వేస్తాం.. ఆ సెలబ్రిటీలకు డీసీపీ సీరియస్ వార్నింగ్..
నేను స్పందించను
ఎస్‌కేఎన్ (SKN)తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). ఆయనతో ఎలాంటి సమస్యలు లేవని, ఆయన చేసిన కామెంట్స్‌తో కూడా తనకు సంబంధం లేదని చెప్పేసింది. ఆ వివాదంపై ఆయన అప్పుడే క్లారిటీ ఇచ్చారని, అసలు తన పేరే ప్రస్తావించనప్పుడు ఈ విషయంపై తాను ఎందుకు స్పందిస్తానని తిరిగి ప్రశ్నించింది ఈ ముద్దుగుమ్మ. ‘బేబి’ టీమ్‌తో చేయాల్సిన మరో మూవీ పలు కారణాల వల్ల ఆగిపోయిందని, ఒకవేళ మళ్లీ ఛాన్స్ వస్తే వారి బ్యానర్‌లో సినిమా చేస్తానని చెప్పుకొచ్చింది. ఆ టీమ్‌తో కలిసి పనిచేయడం తనకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించిందని తెలిపింది వైష్ణవి చైతన్య.