BigTV English

Viral Video: ట్రాఫిక్ పోలీసులకు గోరింటాకు పెట్టిన అమ్మాయి.. ఎర్రగా పండితే ఏం చేస్తుందట?

Viral Video: ట్రాఫిక్ పోలీసులకు గోరింటాకు పెట్టిన అమ్మాయి.. ఎర్రగా పండితే ఏం చేస్తుందట?

ట్రాఫిక్ పోలీసులు తరచుగా వాహనాలు తనిఖీ చేస్తుంటారు. సరైన పత్రాలు లేకుండా అంటే, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ లాంటివి లేకుండా వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధిస్తారు. హెల్మెట్ పెట్టుకోకపోయినా, వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగా లేకపోయినా, సైడ్ మిర్రర్లు విరిగిపోయినా జరిమానా వేస్తారు. ఇక మద్యం తాగి వాహనాలు నడిపితే, వాహనాన్ని స్టేషన్ కు తీసుకెళ్లడంతో పాటు కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తారు. కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు. ఖర్మకాలి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుపడితే, స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగలేక తలప్రాణం తోకకు వస్తుంది. అందుకే, ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలా? అని ప్రయత్నిస్తుంటారు. కానీ, ఓ యువతి.. వాహన తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల చేతికి గోరింటాకు పెట్టడం ఆసక్తి కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ట్రాఫిక్ పోలీసులకు మైదాకు పెట్టిన యువతి

తాజాగా చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. ఇంతలోనే ఓ అమ్మాయి యమహా ప్యాషినో స్కూటీ మీద అక్కడికి వచ్చింది. యథావిధిగా ఆమె బైక్ డాక్యుమెంట్స్ సరిగానే ఉన్నాయి. హెల్మెట్ కూడా పెట్టుకుంది. ఒక డాక్యుమెంట్ తక్కువగా ఉంది. తాను మెహందీ ఆర్టిస్టుగా పని చేస్తున్నానని, ఫంక్షన్ కు వెళ్లే హడావిడిలో మర్చిపోయానని చెప్పింది. సరదాగా ట్రాఫిక్ ఎస్సై నా చేతికి మెహందీ పెడతావా? అని అడిగాడు. ఆమె కూడా సరే అని చెప్పింది. వెంటనే ఆమె తన బ్యాగ్ లో నుంచి హెన్నా కోన్ తీసి అతడి చేతులకు అందమైన డిజైన్ వేసింది. చక్కటి డిజైన్ చూసి ట్రాఫిక్ ఎస్సై ఫిదా అయ్యాడు. ఆ తర్వాత సదరు యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది.


Read Also: ఛీ, మీ కక్కుర్తి పాడుగాను.. 4 అపార్ట్‌మెంట్లలోకి చొరబడింది వాటి కోసమా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

పక్కనే ఉన్న వాహనదారులు ట్రాఫిక్ ఎస్సై చేతులకు, సదరు యువతి మెహందీ వేయడానికి సంబంధించి వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “వాహనదారులతో నిత్యం చిరాకుపడే ఎస్సై గారికి కాసేపు టైమ్ పాస్ అయ్యింది” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అటు “గోరింటాకు పెట్టింది సరే, ఎర్రగా పండితే అతడిని పెళ్లి చేసుకుంటుందా?” అని మరికొంత మంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. “డ్యూటీ టైమ్ లో రెండు చేతులకు మైదాకు పెట్టుకోవడం ఏంటి ఎస్సై గారూ?” అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “చూస్తుండగానే చక్కగా మెహందీ వేసింది. మంచి పనిమంతురాలు” అని మరికొంత మంది ఆ యువతిని మెచ్చుకుంటున్నారు. మొత్తంగా ఈ వీడియో తమిళనాడులో అందరినీ ఆకట్టుకుంటున్నది.

Read Also: ఇదెక్కడి మోసం మామా.. 22 ఫేక్ ఎంప్లాయిస్‌ తో రూ.18 కోట్లు కొట్టేసిన హెచ్‌ఆర్!

Related News

Google 27th Anniversary: గూగుల్ 27వ వార్షికోత్సవం.. తొలినాటి డూడుల్ తో సెర్చ్ ఇంజిన్ సర్ ప్రైజ్

Viral Video: ప్రియుడితో భార్య సరసాలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త!

Viral News: కొండ చివరలో ఆ పని చేస్తుండగా.. జారి లోయలో పడ్డ కారు, స్పాట్ లోనే..

Viral Video: వరదలో పాము.. చేపను పట్టుకొని జంప్.. వీడియో చూసారా?

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

Indore Crime News: బ్రేకప్ చెప్పిందని బైక్‌తో ఢీ కొట్టిన యువకుడు, వీడియో వైరల్

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Big Stories

×