E-Paper
Advertisement

Viral video: రైలు మీద యువకుడితో పోలీసులు కుస్తీ.. వీడియోలు తీసుకుని ఆనందించిన జనం!

Viral video: రైలు మీద యువకుడితో పోలీసులు కుస్తీ.. వీడియోలు తీసుకుని ఆనందించిన జనం!
Advertisement

ఉత్తర ప్రదేశ్ లో ఓ రైల్వే పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి యువకుడి ప్రాణాలను కాపాడాడు. అదే సమయంలో రైళ్ల రాకపోకలకు జరగబోయే ముప్పును తప్పించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించని వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒకే ఒక్క పోలీసు ప్రాణాలకు తెగించి సదరు యువకుడిని కిందికి దింపే ప్రయత్నం చేస్తుంటే, జనాలు వీడియోలు తీస్తున్న ఆనందించడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందటే?  

ఉత్తరప్రదేశ్‌ లోని ప్రతాప్‌ గఢ్ కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కదులుతున్న రైలు మీద ప్రమాదకరంగా కూర్చున్న వ్యక్తిని ఓ పోలీసు బలవంతంగా కిందికి దించుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో సదరు యువకుడు పోలీసు మీద తిరగబడినట్లు కనిపిస్తుంది. రైలు మీది నుంచి కిందికి దిగేందుకు ససేమిరా ఒప్పుకోలేదు. అతడిని ఎలాగైనా కిందికి దించాలనని ప్రయత్నించాడు. అయినప్పటికీ పోలీసు దుస్తులు పట్టుకుని దిగకుండా సతాయించాడు. ఇంతలోగా ఓ వ్యక్తి కింది నుంచి రైలు రూఫ్ మీదికి ఎక్కి, పోలీసుతో కలిసి ఆ యువకుడిని కిందికి దింపే ప్రయత్నం చేశాడు.

వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేసిన జనం

Advertisement

రైలు మీద ప్రాణాలకు తెగించి ఓ పోలీసు అధికారి రైల్వేకు ఎలాంటి ముప్పు కలగకుండా, సదరు యుకుడిని దింపేందుకు ప్రయత్నిస్తుంటే, కింద ఉన్న జనం అతడికి సాయం చేయాల్సిందిపోయి, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. “కింద నుంచి ఫోన్ కెమెరాలతో ఆదుకుంటున్న హీరోలకు సెల్యూట్” అంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, పోలీసు మ్యాన్ పై ప్రశంసలు కురిపించడంతో పాటు జనాల పట్టనితనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పోలీసు అధికారి పైన ప్రమాదకరమైన కరెంట్ లైన్లు ఉన్నప్పటికీ, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సదరు వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. నిజంగా అతడి ధైర్యానికి హ్యాట్సాప్” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఎవరు ఏమి చెప్పినా.. పోలీసులు ఎప్పుడూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సిద్ధంగా ఉంటారు. కొన్నిసార్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “రియల్ పోలీస్ ఆఫీసర్. అతడి ధైర్యానికి సలాం” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

రైల్వే భద్రతపై సర్వత్రా ఆందోళన

Advertisement

సదరు యువకుడు ఎంత దూరం నుంచి రైలు మీద ప్రయాణిస్తున్నాడో ఎవరూ గమనించలేదు. ఒకవేళ అతడు పైన ఉన్న హైటెన్షన్ వైర్లకు తగిలి ఉంటే, ఏంటి పరిస్థితి అనే దానిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇలాంటి పనులు సదరు వ్యక్తుల ప్రాణాలు తీయడంతో పాటు రైల్వే ఆపరేషన్స్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read Also: ఉల్లి పెట్టిన లొల్లి.. భార్యకు విడాకులిచ్చిన భర్త, ఇంత చిన్న కారణానికే?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×