Live Beyond Life: మనిషి జీవితకాలం గురించి ఆలోచించినప్పుడు, ఒక సాధారణ ప్రశ్న తలెత్తుతుంది. మనిషి 100 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించడం సాధ్యమేనా? అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. ఇప్పటికే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కూడా ఈ అంశంపై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. దీనికి సమాధానం దొరకడం కాస్త కష్టమే అయినప్పటికీ, సైన్స్, జీవనశైలి మార్పుల వల్ల ఆయుష్షు పెంచుకోవడం సాధ్యం అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
సైన్స్ ఏం చెబుతుంది?
మానవ శరీరంలో జరిగే మార్పులు, జెనెటిక్స్, జీవక్రియలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. జెనెటిక్స్ అనేది మనిషి ఆయుష్షు విషయంలో కీలక పాత్ర పోషిస్తుందట. అందుకే 100 ఏళ్లు దాటిన వారి జన్యువుల ద్వారా, త్వరగా వయసు పెరగకుండే చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. కణాలలోని DNA చివరి భాగాలైన టెలోమెర్ల వల్ల మనిషి ముసలివాడు అవుతాడట. ఈ టెలోమెర్లను రక్షించేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.
వైద్య రంగంలో AI, స్టెమ్ సెల్ థెరపీ, జన్యు సవరణ వంటి టెక్నాలజీల ద్వారా ఆయుష్షును పెంచేందుకు పరిశోధనలు కూడా జరుగుతున్నాయట. అయితే, ఈ పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది అందరికీ సులభంగా అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: శరీరంలోని మలినాలను తొలగించుకోండిలా..
మంచి లైఫ్‌స్టైల్‌తో సాధ్యమే..!
సైన్స్ ఒకవైపు ఉంటే, మన రోజువారీ జీవనశైలి కూడా జీవిత కాలాన్ని పెంచడంలో పెద్ద పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మానసిక శాంతి, నిద్ర వంటివి అలవాటు చేసుకుంటే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడట. దీని వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, గింజలు వంటి సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యం. దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషణ సులభంగా అందుతుంది. అలాగే అధిక చక్కెర, కొవ్వు ఉన్న ఆహారాలను తగ్గించడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందట. ఇది రక్తప్రసరణను మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందట. ఒత్తిడి, ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. అందుకే ఒత్తిడిని అదుపులో ఉంచడానికి ధ్యానం, మ్యూజిక్, స్నేహితులతో సమయం గడపడం వంటివి అలవాటు చేసుకోవడం మంచిది.
100 ఏళ్లు దాటి జీవించడం సాధ్యమైనప్పటికీ, అందరికీ ఇది సులభం కాదు. ఆర్థిక స్థితి, వైద్య సౌకర్యాలు, విద్య, పర్యావరణం వంటి అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయి. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలతో పాటు, జపాన్‌లోని ఒకినావా వంటి చోట్ల, ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఎక్కువ మంది 100 ఏళ్లకు మంచి జీవిస్తున్నారు.