BigTV English

WTC Final : WTC ఫైనల్ మ్యాచ్.. అచ్చం గ్రేట్ ఖలీ వర్సెస్ రే మిస్టీరియో…!

WTC Final : WTC ఫైనల్ మ్యాచ్.. అచ్చం గ్రేట్ ఖలీ వర్సెస్ రే మిస్టీరియో…!

WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ సమయం ఆసన్నమైంది. జూన్ 11 నుంచి 15 వరకు ప్రతిష్టాత్మక లార్డ్స్ లో జరుగనున్న తుదిపోరులో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి రెండోసారి ఛాంపియన్ గా నిలవాలని ఆస్ట్రేలియా భావిస్తుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా తొలి ఐసీసీ టైటిల్ ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే లండన్ కి చేరుకున్నాయి ఇరు జట్లు. ఇక ప్రాక్టిస్ లో మునిగి తేలుతున్నాయి.  దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జూన్ 11వ తేదీ ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఫోటో షూట్ చేసారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బావుమా, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ తరుణంలో ఈ ఫొటోలపై ఘోరంగా ట్రోలింగ్స్ జరుగుతోంది.


Also Read : Salaries of Commentators : క్రికెట్ కామెంట్రీ చెప్పే వాళ్లకు జీతం ఎంతో తెలుసా.. దిమ్మతిరిగి పోవాల్సిందే

దక్షిణాఫ్రికా అలాగే ఆస్ట్రేలియా కెప్టెన్లు  అచ్చం  ఖలీ, రే మిస్టీరియో లాగా కనిపించడం విశేషం. వీరిపై ట్రోలింగ్స్ జరుగుతోంది. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మూడో ఎడిషన్, ఫైనల్ లో గెలిచిన జట్టు మొత్తం $3.6  మిలియన్ల ప్రైజ్ మనీని అందుకుంటుంది. గెలిచిన జట్టు దాదాపు రూ.30.88 కోట్లు అందుకోనుంది. గత రెండు సీజన్లలో 2021, 2023 ప్రైజ్ మనీ కంటే ఈసారి కాస్త ఎక్కువగా అందనుంది. గత రెండు సీజన్లలో మొత్తం ప్రైజ్ మనీ $1.6 మిలియన్లుగా ఉండింది. ఫైనల్ లో ఓడిపోయిన జట్టుకు జట్టుకు $2.16 మిలియన్లు అంటే.. దాదాపు రూ.18.50 కోట్లు అందనున్నాయి. ఇక టెస్ట్ క్రికెట్ ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఐసీసీ ప్రైజ్ మనీని పెంచేసింది. అంటే.. బహుమతి డబ్బు కూడా ఐపీఎల్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువనే చెప్పాలి. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు కి రూ.20కోట్లు బహుమతి ఇవ్వనున్నారు.


Also Read : Sara Tendulkar: ఆ అమ్మాయితో కోరిక తీర్చుకుంటున్న సారా… షాక్ లో గిల్!

2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను ఏ జట్టు గెలిస్తే.. అది చరిత్ర సృష్టిస్తుంది. ఆస్ట్రేలియా టైటిల్ గెలిస్తే.. వారికి వరుసగా రెండో ట్రోఫీ విజయం అవుతుంది. ఇక సౌతాఫ్రికా గెలిచినట్టయితే తొలిసారిగా టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ ని గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందనేది మాత్రం ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదనే చెప్పాలి. రెండు జట్లు కూడా కాస్త బలంగానే కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లార్డ్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి జట్టుగా అవతరించింది. పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకలపై సిరీస్‌లను గెలుచుకోవడం ద్వారా భారతదేశంతో స్వదేశీ సిరీస్‌ను డ్రా చేసుకోవడం ద్వారా దక్షిణాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇంతలో, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారతదేశంపై 3-1 తేడాతో విజయం సాధించి ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరీ.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×