Woman Record Husband Affair| భార్య ఉండగా మరో మహిళను ప్రేమించే భర్తల గురించి మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. అయితే భర్తలు ఇలా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు అనుమానం కలిగినప్పుడు భార్యలు కూడా నడుం బిగించిన కేసులు ఉన్నాయి. తాజాగా అలాంటి కేసు ఒకటి చైనా దేశంలో జరిగింది. కానీ ఈ కేసులో ఆ భార్యకు కోర్టు షాకిచ్చింది. తప్పు ఆమెదేనని తీర్పు చెప్పింది.
చైనా దేశంలోని వూజూ నగరానికి చెందిన వాంగ్ అనే యువతి ఇటీవల కోర్టుకెక్కింది.. తన ప్రియుడి భార్యపై ఆమె కేసు పెట్టింది. తన ప్రైవేట్ జీవితం గురించి బహిరంగంగా వీడియోలు పోస్ట్ చేస్తోందని దాని వల్ల తన వ్యక్తిగత జీవితానికి భంగం కలుగుతోందని వాదించింది. దీంతో కోర్టు కూడా ఆమె పక్షాన తీర్పు చెప్పింది. అయితే అందుకు షరతులు విధించింది
వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 2023లో వాంగ్ అనే యువతి ఆగస్టు 2023లో వూజూ నగరంలో ఒక అపార్ట్ మెంట్ లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుంది. అయితే వాంగ్ జీవితంలో హు అనే యువకుడు వచ్చాడు. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కానీ వారి జీవితంలో అంతా సుఖంగా లేదు. ఎందుకంటే హు ఇంతకుముందే పెళ్లి చేసుకున్నాడు. అతనికి లీ అనే పేరు గల భార్య ఉంది.
హు ప్రవర్తనలో మార్పు రావడంతో అతని భార్యకు అనుమానం కలిగింది. హు ఎక్కువ ఇంటికి వచ్చేవాడు కాదు. దీంతో లీ అతనికి మరో యువతితో సంబంధముందని అనుమానించింది. అందుకే తన అన్న సాయం తీసుకుంది. తన భర్తకు నిజంగానే మరకొరితో అక్రమ సంబంధం ఉన్నదా? లేదా? అనేది తెలుసుకునేందుకు ఆమె తన అన్నతో కలిసి ఒక డిటెక్టివ్ ని హైర్ చేసింది. ఆ డిటెక్టివ్ అన్నీ ఆరా తీసి వారికి వాంగ్, హు మధ్య నిజంగానే వివాహేతర సంబంధం ఉందని.. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పాడు. పైగా వాంగ్ ఎక్కడ నివసిస్తున్నదో కూడా అడ్రస్ తో సహా బండారం బయటపెట్టాడు.
దీంతో లీ చాలా బాధపడింది. కానీ తన భర్తను తనకు కాకుండా చేసిన వాంగ్ కు బుద్ది చెప్పాలని నిర్ణయించకుంది. అందుకే చాలా చాకచక్యంగా తన అన్నతో కలిసి వాంగ్ నివసిస్తున్న ఇంట్లో రహస్యంగా సిసిటీవి కెమెరాలు పెట్టింది. అందులో రికార్డ్ అయిన దృశ్యాలను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం అందరికీ తెలిసి హు, వాంగ్ పరువు పోయింది. ఆ వీడియోల్లో కొన్ని వారిద్దరి బెడ్ రూమ్ వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు అందరి ముందు రావడంతో వాంగ్ చాలా అవమానంగా ఫీలైంది. అందుకే తన ప్రైవేట్ వీడియోలను పబ్లిక్ లో లీక్ చేసిందని తన ప్రియుడి భార్యపై కేసు వేసింది. పైగా పరువునష్టం కింద పెద్ద మొత్తంలో నష్టపరిహారం కోరింది.
Also Read: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం
ఈ కేసుని విచారణ చేసిన టెంగ్ కౌంటీ కర్టు లీ చేసింది తప్పు అని తీర్పు చెప్పింది. వెంటనే ఆ వీడియోలు సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో లీ తరపున లాయర్ వాదిస్తూ.. ఆమె భర్త హు, వాంగ్ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కలిగి ఉండడం సహించ లేకే ఆమె ఈ పని చేసిందని చెప్పాడు. ఈ వీడయోలు తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నందకు ఆధారాలు కూడా అని వాదించాడు. అందుకే కోర్టు కూడా వాంగ్ కు హెచ్చరించింది. సమాజంలోని నైతిక విలువలను పాటించలేని వాంగ్ లాంటి మహిళలు పరువు నష్టం కేసులు వేసే హక్కు కోల్పోతారని చెప్పింది. అందుకే లీ కి మందలించి వదిలేసింది.
ఈ కేసు గురించిన పోస్ట్ లు చైనాలో బాగా వైరల్ అవుతున్నాయి. వారంతా లి పట్ల సానుభూతి తెలిపుతూ కామెంట్స్ చేశారు.