Amit Shah: మోదీ ప్రధానిగా మూడో సారి తన పదవి కాలాన్ని పూర్తి చేస్తారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఏడాది ప్రధానికి 75 ఏళ్లు నిండుతాయని.. అప్పుడు పదవీ విరమణ చేస్తారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. మోదీకి 75 ఏళ్లు వచ్చినా ప్రధాని అవుతారని తెలిపారు.
మోదీ మూడో సారి కూడా పాలనను పూర్తి చేస్తారని నొక్కి చెప్పారు. అంతే కాకుండా కేజ్రీవాల్ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను సీఎం పదవి నుంచి తొలగిస్తారని అన్నారు. అమిత్ షాను ప్రధానిని చేస్తానని వ్యాఖ్యానించగా దీనిపై అమిత్ షా స్పందించారు. హైదరాబాద్ లో ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీజీ ప్రధాని కాలేరని బీజేపీ రాజ్యాంగంలో లేదని అన్నారు. మరో సారి ఆయనే ప్రధాని అయి పదవీ కాలం కూడా పూర్తి చేస్తారని చెప్పారు.
Also Read: నేడు నేషనల్ టెక్నాలజీ డే.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో మోదీ వయసు గురించి మాట్లాడారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థులు కరువయ్యారని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బీజేపీలో నేతల వయస్సు 75 ఏళ్లు అని అన్నారు. మోదీ వయస్సు సెప్టెంబర్ 17 తో 75 ఏళ్లకు చేరుతుందని చెప్పారు. మోదీ రిటైర్ అవుతారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాగా ఆయన వ్యాఖ్యలపై అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.
#WATCH | On Delhi CM Arvind Kejriwal's 'Amit Shah will be the PM, if BJP wins' remark, Union Home Minister Amit Shah says "I want to say this to Arvind Kejriwal and company and INDI alliance that nothing as such is mentioned in BJP's constitution. PM Modi is only going to… https://t.co/eJgCHox2Q7 pic.twitter.com/bKJQ4OtMhe
— ANI (@ANI) May 11, 2024