BigTV English

Cucumber: దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే.. ఎంత ప్రమాదమో తెలుసా ?

Cucumber: దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే.. ఎంత ప్రమాదమో తెలుసా ?

Cucumber: వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని, తేమను అందించే దోసకాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. దోసకాయలో 95% వరకు నీరు ఉంటుంది. దీనివల్ల ఇది దాహాన్ని తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే.. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. దోసకాయ తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదనేది.


ఆయుర్వేదం ప్రకారం.. ఏదైనా పండ్లు లేదా కూరగాయలు తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు. ముఖ్యంగా దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

1. జీర్ణ సమస్యలు:
దోసకాయ తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. దోసకాయలో ఉండే కొన్ని పోషకాలను జీర్ణం చేయడానికి జీర్ణ రసాలు అవసరం. మనం నీళ్లు తాగడం వల్ల ఈ రసాలు పలుచబడతాయి. దీనివల్ల జీర్ణ ప్రక్రియ సరిగా జరగదు. ఫలితంగా.. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.


2. శరీరానికి పోషకాలు అందకపోవడం:
దోసకాయలో ఉండే ముఖ్యమైన పోషకాలు, ఎంజైమ్‌లు, విటమిన్లు శరీరానికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. నీరు జీర్ణ ఎంజైమ్‌లను పలుచబరచడం వల్ల ఆహారంలోని పోషకాలు సరిగా విచ్ఛిన్నం కావు. అందుకే.. దోసకాయ వల్ల లభించే పోషక ప్రయోజనాలు పూర్తిగా పొందలేము.

3. కడుపు ఉబ్బరం, గ్యాస్:
దోసకాయలో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనం దాన్ని తిన్న వెంటనే నీరు తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. ఇది జీర్ణక్రియను మరింత కష్టతరం చేస్తుంది.

4. విరేచనాలు:
కొన్ని సందర్భాల్లో.. దోసకాయ తిన్న తర్వాత వెంటనే నీరు తాగితే, జీర్ణ ప్రక్రియలో అసమతుల్యత ఏర్పడి, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. ఇలా అందరికీ జరగకపోవచ్చు. కానీ సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Also Read: ఫేస్ సీరం వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా ?

దోసకాయ తిన్న తర్వాత 20-30 నిమిషాల వరకు నీరు తాగకుండా ఉండడం మంచిది. ఈ సమయం జీర్ణక్రియకు సరిపోతుంది. ఆ తర్వాత.. మీరు నెమ్మదిగా నీరు తాగొచ్చు. అలాగే, దోసకాయ తినే ముందు కూడా 15-20 నిమిషాల ముందు నీరు తాగడం మంచిది.

ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దోసకాయ తినడానికి ముందు లేదా తర్వాత కొంత సమయం విరామం ఇవ్వడం వల్ల దానిలోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించగలుగుతుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×