BigTV English

104 Years Old Man Voted: 18వ సారి ఓటేసిన 104 ఏళ్ల రాముడు.. నేటి ఓటర్లకు ఆదర్శం!

104 Years Old Man Voted: 18వ సారి ఓటేసిన 104 ఏళ్ల రాముడు.. నేటి ఓటర్లకు ఆదర్శం!

104 Years Old Man Voted 18 times: ఎన్నికలు వచ్చిన ప్రతిసారి యువ ఓటర్లు వస్తూనే ఉంటారు. అయినా.. ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. కారణం.. ఎన్నికలపై ఆసక్తి లేకపోవడం, ఏ నాయకుడు వచ్చినా అభివృద్ధి చేయడన్న అభిప్రాయం.. ఎన్నికల ముందు వాగ్ధానాలే తప్ప.. గెలిస్తే మచ్చుకైనా ఉద్యోగాలివ్వకపోవడం వంటివి పోలింగ్ శాతంపై ప్రభావం చూపిస్తున్నాయి. పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేసేవారు అంతకంతకూ తగ్గుతున్నారు.


ఓటు ఎందుకు వేయాలి ? వేస్తే మాకేంటి ? అనుకునేవారికి ఓ తాతగారు ఆదర్శంగా నిలుస్తున్నారు. 104 ఏళ్ల వయసులోనూ ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. 18వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన రొంగల రాముడు. ఆయనొక వ్యాపారవేత్త. ముందుగా వృద్ధులు, వికలాంగుల కోసం కేటాయించిన హోమ్ ఓటింగ్ ద్వారా రాముడు 18వ సారి ఓటు వేసారు.

Also Read: నేడు, రేపు హోం ఓటింగ్.. ప్రారంభమైన ప్రక్రియ


ఓటింగ్ సిబ్బంది నిడదవోలులోని ఆయన ఇంటికి బ్యాలెట్ బాక్సుల్ని తీసుకెళ్లారు. ఆయన తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశారు. ఓటింగ్ ఎట్ హోమ్ కార్యక్రమం ద్వారా 85 సంవత్సరాలు పైబడినవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది ఈసీ. ఏపీలో ఈ కార్యక్రమం గురువారం నుంచే మొదలైంది. మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×