BigTV English

2024 AP POLITICS: పీక్స్‌లో ఏపీ పాలిటిక్స్.. జగన్ వ్యూహమేంటి?

2024 AP POLITICS: పీక్స్‌లో ఏపీ పాలిటిక్స్.. జగన్ వ్యూహమేంటి?

2024 AP POLITICS: ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ సర్కార్ 2024లో రెండో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. కానీ అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే కొత్త ఏడాది వైసీపీకి మర్చిపోలేని ఏడాదిగా మారిపోనుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇక నూతన సంవత్సరంలో జగన్ సర్కార్ మందున్న సవాళ్లు ఏంటో చూద్దాం.


నూతన ఏడాది ఏపీ రాజకీయాలను టెన్షన్ పెట్టనుంది. రాష్ట్రంలోని అన్నీ పార్టీలకు పెద్ద పరీక్ష పెట్టబోతోంది. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, బీజేపీలకు జీవన్మరణ సమస్యగా మారుతున్నాయని చెప్పవచ్చు. అందుకే పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో ఆంధ్రా పాలిటిక్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి.

2023లోనే ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసిన జగన్.. దాన్ని మరింత వేగంగా తీసుకెళ్లనున్నారు. ఈ రోజు నుంచి మూడువేళ రూపాయల ఫించన్ ఇస్తున్నారు. మాట తప్పం మడెం తిప్పం అంటూ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ.. సంక్షేమ జపం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లోనూ విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు అంగ్వాడీల, ఆశా వర్కర్ల ధర్నాలు, మున్సిపల్ కార్మికుల నిరసనలు, అమరావతి రైతుల ఉద్యమాలు, మూడు రాజధానులు అంశం అలానే ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగుల్లో జగన్ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతతో ఆ పార్టీని ఓటమి భయం పట్టిపీడిస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఇదిలా ఉంటే వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ..2019 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల సీన్‌ను రిపీట్ చేస్తామని ఆ పార్టీ చెబుతోంది. ఈ సారి 175కి 175 సీట్లలో విజయం సాధించి కొత్త చరిత్రను రాయలని జగన్ సర్కార్ చూస్తోంది.

ఇందులో భాగంగానే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించిన జగన్.. క్షేత్రస్థాయిలో ఉన్న బలాలను ఎప్పటికప్పుడు సర్వేల రూపంలో తెప్పించుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను మోహమాటం లేకుండా తప్పిస్తూ.. సీటు ఇవ్వలేమని తేల్చి చెప్పేస్తున్నారు. అధికారంలోకి వస్తే వేరే పదవులు ఇస్తామంటూ బుజ్జగిస్తున్నారు.

టీడీపీ- జనసేన కూటమి జగన్‌కు అతిపెద్ద సవాల్‌‌గా మారనుంది. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రజలు మందుకు వెల్లడంతో ఏపీలో పాలిటిక్స్ మరింత్ హాట్‌హాట్‌గా మారాయి. ఈ వారం నుంచి చంద్రబాబు, లోకేష్, పవన్ వేరువేరుగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణను సన్నద్ధమవుతున్నారు.

షర్మిల కాంగ్రెస్‌లో చేరితే అన్నిటికంటే పెద్ద సమస్యగా జగన్‌ కు మారే అవకాశం ఉంది. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ అయితే మాత్రం జగన్ మరింత ఇరకాటంలో పడటం పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సొంత సోదరి షర్మిల ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లి విమర్శలు చేస్త.. జగన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారనే చర్చ జరుగుతోంది.

Related News

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Big Stories

×