E-Paper
Advertisement

హోంగార్డుల విషయంలో సాయిరెడ్డి సంచలన పోస్ట్.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు బిగ్ అలర్ట్!

హోంగార్డుల విషయంలో సాయిరెడ్డి సంచలన పోస్ట్.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు బిగ్ అలర్ట్!
Advertisement

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లు దాటుతున్నా, ఇంకా పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా హోంగార్డుల పంపిణీ సమస్య ఒకటి. దీనివల్ల ఏళ్లకు ఏళ్లుగా వందలాది మంది హోంగార్డుల జీవితాలు, వారి కుటుంబాల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో పడిపోయాయి.

సాయిరెడ్డి విజ్ఞప్తి

Advertisement

ఈ సున్నితమైన సమస్యపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఎక్స్ వేదికగా స్పందించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉన్నా, ఇప్పటికీ తెలంగాణలోనే కొనసాగుతున్న 500 మందికి పైగా ఏపీ హోంగార్డులను తక్షణమే సొంత రాష్ట్రానికి కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తీవ్రంగా దెబ్బతింటున్న సంక్షేమ ఫలాలు

Advertisement

‘రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్న ఈ హోంగార్డులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతికంగా ఏపీకి చెందినవారైనా తెలంగాణలో పనిచేస్తుండటంతో, ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ లభించాల్సిన సంక్షేమ ప్రయోజనాలు, పథకాలకు వీరు దూరమవుతున్నారు. ఫలితంగా వీరి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక, సామాజిక వేదనను అనుభవిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి

ఇకనైనా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ విషయాన్ని మానవతా కోణంలో పరిశీలించాలన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు పరస్పరం చర్చించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏళ్లతో కూడుకున్న ఈ నిరీక్షణకు తెరదించి, వీలైనంత త్వరగా 500 మందికి పైగా ఉన్న హోంగార్డులను వారి సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు పంపించేలా వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

Tags

Related News

సాగునీటి రంగానికి పూర్వవైభవం.. రూ.160 కోట్ల బిల్లుల విడుదలపై మంత్రి నిమ్మల హర్షం

ఆందోళన చేస్తే లాఠీలతో కొడతారా? గొంతు వినిపించడం నేరమా? సీఎం చంద్రబాబు‌పై జగన్ ఆగ్రహం

ఏపీలో ఘోరాతి ఘోరం.. నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనువడు!

విధుల్లో ఉండగానే గుండెపోటు.. నున్న సీఐ అలీ మృతి!

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

Big Stories

Advertisement
×