BigTV English

Chirutha caught in Tirumala : బోనులో చిక్కిన చిరుత.. నడకదారిలో ఆంక్షలు..

Chirutha caught in Tirumala : బోనులో చిక్కిన చిరుత.. నడకదారిలో ఆంక్షలు..
Chirutha caught in Tirumala

Tirumala latest updates in telugu(Local news andhra Pradesh) :

తిరుమలలో చిరుత బోనులో చిక్కింది. ఇటీవల అలిపిరి నడకమార్గంలో 6 ఏళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు చిరుతను బంధించే చర్యలు చేపట్టారు. బాలికపై దాడి చేసిన ప్రాంతంలో మూడు బోన్లు ఏర్పాట్లు చేశారు. చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను అమర్చారు.


చిరుత రెండు రోజులుగా ఐదు ప్రాంతాల్లో సంచరించినట్లు గుర్తించారు . ఈ క్రమంలోనే తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన బాలిక లక్షిత తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసింది. అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. నెలన్నర క్రితం నడకమార్గంలోనే ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. అడవిలోకి లాక్కెళ్లింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటన తర్వాత చిరుతను బంధించారు. కల్యాణ్‌ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.


చిరుత దాడి ఘటన తర్వాత టీటీడీ అప్రమత్తమైంది. నడకదారిలో ఆంక్షలు విధించింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతిస్తోంది. అయితే తాజాగా తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. నడకదారిలో చిరుత సంచారించినట్లు చెబుతున్నారు భక్తులు. అయితే అధికారులు కూడా చిరుత కదలికలు ఉన్నట్లు నిర్థారించారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×