SIIMA 2025: దుబాయ్.. టాలీవుడ్ సెలబ్రిటీలతో కళకళలాడిపోయింది. గతరాత్రి జరిగిన సైమా వేడుకలు దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీలో అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో తొలిరోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు. గతేడాది అత్యంత అద్భుతమైన ప్రతిభ కనపర్చిన నటీనటులకు, చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఇక ఈసారి ప్రేక్షకులను మెప్పించిన ప్రతి సినిమా అవార్డును సొంతం చేసుకుంది.
Maadhavi Latha: టెంపుల్స్ లో స్కిన్ షో… చెప్పు తీసుకొని కొట్టాలి
సైన్స్ ఫిక్షన్ కు మైథాలజీని జోడించి.. ప్రేక్షకులను వేరే లోకానికి తీసుకెళ్లిన కల్కి 2898AD సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. ఇక పుష్ప 2 సినిమాకు అవార్డుల పంటే అని చెప్పొచ్చు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్.. ఉత్తమ నటిగా రష్మిక అవార్డులు అందుకున్నారు. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని అందుకున్న హనుమాన్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా తేజ సజ్జా అవార్డులు అందుకున్నారు.
ఇక సైమా 2025 లో తెలుగు నుంచి అవార్డులు అందుకున్న విజేతలు వీరే..
ఉత్తమ చిత్రం – కల్కి
ఉత్తమ దర్శకుడు – సుకుమార్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – ప్రశాంత్ వర్మ
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – తేజ సజ్జా
ఉత్తమ నటి – రష్మిక మందన్నా
ఉత్తమ నటి (క్రిటిక్స్) – మీనాక్షి చౌదరి
ఉత్తమ సహాయ నటుడు – అమితాబ్ బచ్చన్
ఉత్తమ సహాయ నటి – అన్నే బెన్
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ)
ఉత్తమ గీతరచయిత – రామ్ జోగయ్య శాస్త్రి
ఉత్తమ గాయకుడు – శంకర్ బాబు కందుకూరి
ఉత్తమ గాయని – శిల్పా రావు
ఉత్తమ ప్రతినాయకుడు – కమల్ హాసన్
ఉత్తమ పరిచయ నటి – పంకూరి, భాగ్యశ్రీ బోర్సే
ఉత్తమ పరిచయ నటుడు – సందీప్ సరోజ్
ఉత్తమ పరిచయ దర్శకుడు – నంద కిషోర్ యేమని
ఉత్తమ కొత్త నిర్మాత – నిహారిక కొణిదెల
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు
ఉత్తమ హాస్యనటుడు – సత్య
SIIMA – 2025: పుష్పగాడి రూల్.. అవార్డుల వర్షం కురిపించిందిగా!