BigTV English

ACB : దుర్గ గుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు..

ACB : దుర్గ గుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు..

ACB raids in ap today: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్‌ వాసా నగేష్‌ ఇంటిలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టింది. విజయవాడ కుమ్మరిపాలెం కూడలి లోటస్‌ అపార్టుమెంట్‌లోని నగష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.


ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, భీమడోలు ప్రాంతాల్లోని నగేష్ సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ దాడులకు ముందే సూపరింటెండెంట్‌ సెలవు పెట్టారు. అయినాసరే ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కుమ్మరిపాలెం సెంటర్ లో నగేష్ అద్దెకు ఉంటున్న ఇంట్లో పలు డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించారు. తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలోని నగేష్‌ నివాసంలో రూ.17.91 లక్షల నగదు, 209 గ్రాముల బంగారం లభ్యమయ్యాయని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ద్వారకా తిరుమలలో జీ+4 ఇల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలులో మూడు గృహాలు, ఒక ప్లాటుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ద్వారకాతిరుమల యూనియన్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఒక లాకరును ఇంకా తెరవాల్సి ఉందని తెలిపారు. బ్యాంకు ఖాతాలు, లాకర్లు ధ్రువీకరించుకోవాల్సి ఉన్నందున సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు స్పష్టంచేశారు.


నగేష్‌ గతంలో ద్వారకా తిరుమలలో పని చేశారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆర్జేసీ స్థాయి అధికారి ఈ వ్యవహారంపై విచారణ చేశారు. ఈ కేసులో నగేష్ నుంచి డబ్బులు రికవరీ చేశారు. గతంలో శాఖాపరమైన విచారణ చేసిన ఆర్జేసీ భ్రమరాంబ ప్రస్తుతం దుర్గగుడి ఈవోగా ఉన్నారు.

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×