E-Paper
Advertisement

అమరావతి పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ.. రూ.47 వేల కోట్ల అప్పు ఎందుకు?- అంబటి రాంబాబు

అమరావతి పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ.. రూ.47 వేల కోట్ల అప్పు ఎందుకు?- అంబటి రాంబాబు
Advertisement

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో మరోసారి రాజకీయ సెగలు రాజుకున్నాయి. పెనుమాక గ్రామంలో భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీపై జరిగిన దాడులు, తదనంతర పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రభుత్వంపై, టీడీపీ శ్రేణులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అమరావతి.. ఒక అంతులేని కథ!

Advertisement

కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు (2026 నాటికి) పూర్తవుతున్నా అమరావతిలో ఎలాంటి పురోగతి లేదని అంబటి రాంబాబు విమర్శించారు. గతంలో ఐదేళ్ల పాలనలోనూ చంద్రబాబు దీనిని పూర్తి చేయలేకపోయారని, అమరావతి ఇవాళ ఒక ‘అంతులేని కథ’లా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. స్వయం సమృద్ధి (సెల్ఫ్ సస్టైన్) ప్రాజెక్టు అని చెప్పి, ఇప్పుడు రూ. 47 వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిపై ఖర్చు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాజధాని పేరుతో ఇప్పటికే 50 వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 50 వేల ఎకరాల కోసం రైతులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు.

బలవంతపు భూసేకరణ.. రౌడీయిజం

Advertisement

భూములివ్వడానికి ఇష్టం లేని రైతులపై ‘కంపల్సరీ ఎక్విజేషన్’ (నిర్బంధ భూసేకరణ) విధానాన్ని ప్రయోగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూములు ఇవ్వని రైతుల పంట పొలాలను ముంచేసేందుకు కొండవీటి వాగుకు గండి కొడుతున్నారని, రైతులు పొలాల్లోకి వెళ్లకుండా చుట్టూ కందకాలు తవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు ఇవ్వకపోయినా బలవంతంగా రోడ్లు వేసి, బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. ఈ అన్యాయాలపై వైయస్ జగన్‌ను కలిసి రైతులు మొరపెట్టుకోగా, వారి సమస్యలపై పోరాడేందుకే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

Also Read: మంచిర్యాలలో దారణం.. తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న!

బాధితులే నిందితులుగా..

రైతుల విజ్ఞప్తి మేరకే వైయస్సార్సీపీ కమిటీ పెనుమాక వెళ్తుంటే.. చంద్రబాబు, లోకేష్‌ల ఆదేశాలతో టీడీపీ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దౌర్జన్యానికి దిగారని అంబటి ఆరోపించారు. పోలీసుల ముందే ఈ దాడులు జరిగాయని, దాడిలో ఒక కానిస్టేబుల్ తల పగిలి ఆసుపత్రి పాలైతే, తిరిగి బాధితులైన వైయస్సార్సీపీ నేతలపైనే రెండు తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో బాధితులే నిందితులుగా మారే విచిత్ర పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్న కేసులైతే రిమాండ్ దొరకదనే ఉద్దేశంతోనే తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని, ఇలాంటి కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తి లోకేష్ పక్కన ఫోటోల్లో కనిపిస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన నిలదీశారు. అమరావతి పేరుతో నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి పెద్ద దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.

Related News

అంతర్జాతీయ నగరం.. అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం! ఆపై సీఎం చంద్రబాబు..

ఆధారాలు పట్టుకుని రండి.. డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

శ్రీకాకుళంలో టైటానియం ప్లాంట్‌.. సీఎం చంద్రబాబుతో కరణ్ అదానీ భేటీ, రూ.16 వేల కోట్లు పెట్టుబడులు

భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు.. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే!

ఉప్పాడ తీర రక్షణకు.. ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందం, మాట నిలబెట్టుకున్న పవన్

Big Stories

Advertisement
×