E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Rowdy Sheeters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాజా మాజీ రౌడీ షీటర్ల ఇష్టా రాజ్యం.. వినక పోతే కత్తులతో..?

Rowdy Sheeters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాజా మాజీ రౌడీ షీటర్ల ఇష్టా రాజ్యం.. వినక పోతే కత్తులతో..?
Advertisement

Rowdy Sheeters: స్వేచ్చ బ్యూరో: గ్రేటర్ లో తాజా మాజీ రౌడీ షీటర్లు రాజ్యమేలుతున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలు మొదలుకొని ఫైనాన్స్ గొడవల్లో తలదూరుస్తూ బలవంతపు సెటిల్మెంట్లు చేస్తున్న వారు కొందరైతే మామూళ్ల కోసం బెదిరిస్తున్న వారు మరికొందరు. తాము చెప్పినట్టు వినకపోతే భౌతిక దాడులు చేస్తున్నారు. కొన్నిసార్లు మారణాయుధాలతో బెదిరించటమే కాకుండా గాయపరుస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే కొందరు తాజా మాజీ రౌడీ షీటర్లకు వేర్వేరు రాజకీయ పార్టీల్లోని కొందరు బడా నేతలతోపాటు పోలీస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉండటం. దాంతో ఈ దాదాల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వీరి అంగబలం పొలిటికల్ కాంటాక్ట్స్ నేపథ్యంలో చాలా మంది బాధితులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యం కూడా చెయ్యటం లేదు.

క్వాలిఫికేషన్స్ ఇవే..

దొమ్మీలు.. దాడులు.. హత్యాయత్నాలు.. హత్యలు.. ఇవే తాజా.. మాజీ రౌడీ షీటర్ల క్వాలిఫికేషన్లు. ఎన్ని కేసుల్లో ఉంటే అంత పెద్ద రౌడీలుగా చలామణి అవుతున్నారు. ఇక్కడ మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే వీళ్లు యువకులతో గ్యాంగులు ఏర్పాటు చేసుకుంటుండటం. అయితే, ఎవరిని గ్యాంగులో చేర్చుకోవాలన్న విషయంలో తాజా మాజీ రౌడీ షీటర్లు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న కేసుల్లో అరెస్ట్ అయినవారు ఏ పని లేకుండా తిరుగుతూ కాస్త తెగువ ఉన్నవారిని దగ్గరకు తీసుకుంటున్నారు. చిల్లర గొడవలు చేస్తే ఏమొస్తుంది నా దగ్గర చేరిపో అంతా నేను చూసుకుంటా అని చెబుతున్నారు. అన్న నీడలోకి వెళ్లిపోతే మనం కూడా కాస్త హవా నడిపించుకోవచ్చు.. ఇన్ని డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని కొందరు యువకులు వీరి పంచన చేరుతున్నారు.

రెండు పూటలు బిర్యానీ..

Advertisement

బాస్ చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తున్నారు. ఇంత చేస్తున్నా వీళ్లు ఏమన్నా వెనకేసుకుంటున్నారా? అంటే, అదీ లేదు. రోజంతా వెంట తిరిగినందుకు వీరికి గ్యాంగ్ లీడర్లు రెండు పూటలు బిర్యానీ తినిపిస్తున్నారు. రాత్రి అయితే, మద్యం తాగటానికి కొంత డబ్బు ఇస్తున్నారు. అన్నా అవసరం పడింది అని అడుక్కున్నపుడు కాస్త డబ్బు సాయం చేస్తున్నారు. అయితే, గ్యాంగులో కాస్త కీలకంగా ఉంటూ మిగితా వారు తమ వెంటే ఉండేలా చూసుకుంటున్న వారికి మాత్రం నెలకు ఇంత అని డబ్బు ఇస్తున్నారు. మిగితా వారికి మాత్రం ఏదైనా సెటిల్మెంట్ అయినపుడు మాత్రమే వారి చేతుల్లో కాసిన్ని కరెన్సీ నోట్లు పెడుతున్నారు.

Also read: Pre-Primary Education: ప్రభుత్వ బడుల్లో ప్రీ-ప్రైమరీ క్లాసుల ధమాకా.. అదనంగా మరో 2,769 స్కూళ్లు..!

5వేల మందికి పైనే..

Advertisement

ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో కలిపి 5వేల మందికి పైగా రౌడీ షీటర్లు ఉన్నారు. అయితే, బలవంతపు సెటిల్మెంట్లు చేసేవాళ్లు కొందరు మాత్రమే ఉన్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే పొద్దు పొద్దున్నే వీరి ఇండ్ల ముందు సెటిల్మెంట్లు చేయించుకోవటానికి పదుల సంఖ్యలో జనం బారులు తీరి ఉంటుండటం. అక్కడే బేరసారాలు కుదుర్చుకుంటుండటం. ఇక, కొందరు తాజా మాజీ రౌడీ షీటర్లు ఏకంగా కార్పొరేట్ తరహాలో ఆఫీస్ లు పెట్టుకుని దందాలు చేస్తుండటం.

ఆర్భాటం మాములుగా ఉండదు..

ఇలా సెటిల్మెంట్లు చేస్తున్నవారి ఆర్భాటం మాములుగా ఉండదు. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే లగ్జరీ కార్లు.. ముందు సీట్లో బాస్ ఉంటే వెనక సీట్లలో ముఖ్య అనుచరులు కూర్చుంటారు. అవసరం ఉందనుకున్నపుడు వెనక మరో ఒకటో.. రెండు కార్లలో గ్యాంగ్ సభ్యులు బయల్దేరుతారు. అన్న సైగ చేస్తే చాలు అవతలి వారిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే మాజీ రౌడీ షీటర్ అంబర్ పేట్ శంకర్ ఇద్దరు రియల్టర్ల మధ్య ఉన్న వివాదంలో జోక్యం చేసుకుని భయపెట్టి సెటిల్మెంట్ చెయ్యటానికి ప్రయత్నించాడు. తనను ఆశ్రయించిన రియల్టర్ తరపున వకాల్తా తీసుకొని అవతలి వ్యక్తిని అనుచరుల ద్వారా అన్న రమ్మంటుండని శ్రీనగర్ కాలనీలోని ఆఫీస్ కు పిలిపించుకున్నాడు. అక్కడ తనను బెదిరించటమే కాకుండా దాడి చేసి కొట్టారని బాధితుడు ఫిర్యాదు చెయ్యగా బంజారాహిల్స్ పోలీసులు అంబర్ పేట్ శంకర్, మరికొందరిపై కేసులు నమోదు చేశారు.

Also read: హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. తెలంగాణలో ఆ జిల్లాలకు అలర్ట్, ఉరుములు-మెరుపులతోపాటు

కత్తులతో బెదిరించి..

ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లో ఉన్న ఉన్న శాలిబండ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ అయూబ్ ఖాన్.. అతని కొడుకులది ఇదే దందా. ఒక్క అయూబ్ ఖాన్ మీదనే 70కి పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. గడిచిన ఆరు నెలల్లోనే మామూళ్ల కోసం కత్తులతో బెదిరించిన రౌడీ షీటర్లు దాదాపు పది మంది పట్టుబడటం నెలకొని ఉన్న పరిస్థితికి దర్పణం పడుతుంది. పోలీస్ వర్గాలు చెబుతున్న ప్రకారమే చాలా మంది బాధితులు భయంతో ఫిర్యాదులు ఇవ్వటానికి కూడా ముందుకు రావటం లేదు. దాంతో చాలా ఉదంతాలు వెలుగులోకే రావటం లేదు.

సత్సంబంధాలు..

ఇలా కోట్ల రూపాయల వివాదాల్లో సెటిల్మెంట్లు చేస్తున్న తాజా మాజీ రౌడీ షీటర్లకు వేర్వేరు పార్టీలకు చెందిన కొందరు పెద్ద నేతలతో పాటు పోలీస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. ఎన్నికలపుడు. తమ వ్యక్తిగత పనులు చక్కబెట్టటానికి పనికి వస్తారని నాయకులు కొందరు వీరికి అండగా ఉంటున్నారు. వాళ్లకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ అధికారులతో మాట్లాడుతూ మనోడే కాస్త చూడండి అంటూ సాయం చేస్తున్నారు. ఇక, ఎస్ఐ, సీఐ, ఏసీపీ స్థాయిలో ఉన్న కొందరు అధికారులు ఇలా సెటిల్మెంట్లు చేస్తున్న వారితో అంటకాగుతున్నారు. కారణం.. వీళ్ల నుంచి కానుకలు అందుతుండటమే అన్నది బహిరంగ రహస్యమే. కొందరు అధికారులైతే రౌడీ షీటర్లు ఇచ్చే మందు పార్టీల్లో భాగమై చీర్స్ కూడా కొడుతున్నారు. ఇలాంటివారి ఆగడాలకు చెక్ పడాలంటే పైస్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీస్ వర్గాల్ చెబుతున్నాయి.

Also read: నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

Related News

Advertisement Policy: జీవో నెంబర్ 84లో సంచలన సవరణలు చేసిన తెలంగాణ సర్కార్.. అవి ఇవే..!

నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

Jana Sena: ప్రజారాజ్యం పాత కాపులకు పవన్ కల్యాణ్ పిలుపు.. తెలంగాణలో జనసేన నెక్ట్స్ ప్లాన్ ఇదే..?

Pre-Primary Education: ప్రభుత్వ బడుల్లో ప్రీ-ప్రైమరీ క్లాసుల ధమాకా.. అదనంగా మరో 2,769 స్కూళ్లు..!

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. తెలంగాణలో ఆ జిల్లాలకు అలర్ట్, ఉరుములు-మెరుపులతోపాటు

లైక్‌ల కోసం ఆశపడి.. జీవితాన్ని నాశనం చేసుకుంటున్న యువత, ఏకంగా 456 మంది ఏం చేశారంటే..

BRS MLCs: రూటు మార్చిన బీఆర్‌ఎస్ పెద్దలు.. మండలి వద్దు అసెంబ్లీ ముద్దు అంటున్న నేతలు..!

Big Stories

×