Ambati Rayudu react on pakistan women team: T20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో (2026 Women’s T20 World Cup tournament) పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగింటిలో ఓడిపోయిన పాకిస్తాన్, నిన్న చివరి మ్యాచ్ లో మాత్రం విజయం సాధించింది. పసికూన నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ మహిళల జట్టు ( Pakistan Womens Team) విక్టరీ అందుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ విజయం సాధించడం పైన అంబటి రాయుడు ( Ambati Rayudu) సెటైర్లు పేల్చారు. నెదర్లాండ్ పై గెలిచారు కదా..ఇక పాక్ వీధుల్లో ర్యాలీలు చేయండంటూ చురకలు అంటించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) జరిగినప్పుడు ఎగబడి ర్యాలీలు తీసిన షాహిద్ అఫ్రిది (Shahid Afridi) ఎక్కడ? వెంటనే పాక్ వీధుల్లో ర్యాలీలు తీయాలంటూ అంబటి రాయుడు (Ambati Rayudu) సెటైర్లు పేల్చారు. దీంతో అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టు ఎలిమినేట్ అయింది. అయితే చివరి లీగ్ మ్యాచ్ లో మాత్రం నెదర్లాండ్స్ జట్టుపై బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంది పాకిస్తాన్ మహిళల జట్టు. నిన్న నెదర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ చివరి లీగ్ మ్యాచ్ నేపథ్యంలో 37 పరుగులు తేడాతో పాకిస్తాన్ కింద మీద పడి గెలిచింది. అయితే లీగ్ దశలో పాకిస్తాన్ మహిళల జట్టు విజయం సాధించిన నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సెటైర్లు పేల్చారు. లీగ్ దశలో నెదర్లాండ్స్ పైన పాకిస్తాన్ విజయం సాధించిన నేపథ్యంలో ఆ దేశ ప్రజలు సంబరాలు చేసుకోండి అంటూ చురకలు అంటించారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు షాహిద్ అఫ్రిది రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేశాడు కదా… ఇప్పుడు కూడా చేయాలంటూ దారుణంగా ర్యాగింగ్ చేశారు అంబటి రాయుడు.
షాహిద్ అఫ్రిది ఒక్కడే కాకుండా… పాకిస్తాన్ పురుషుల క్రికెటర్లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ నక్వి అందరూ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అవసరమనుకుంటే పాకిస్తాన్లో మూడు రోజులపాటు హాలిడే ప్రకటించాలని కూడా సెటైర్లు పేల్చాడు. పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో ఉన్న నెదర్లాండ్స్ పైన గెలవడం అంతా ఈజీ కాదని.. కానీ పాకిస్తాన్ మహిళల జట్టు మాత్రమే ఆ విజయాన్ని నమోదు చేస్తుందని వెల్లడించారు. కాబట్టి ఈ విజయోత్సవ ర్యాలీని కచ్చితంగా పాకిస్తాన్ లోని లాహోర్ వీధుల్లో నిర్వహించాలని చురకలు అంటించారు. దీంతో అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో తొలి దశలోనే పాకిస్తాన్ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ.. పాకిస్తాన్ ను అవమానించేలా అంబటి రాయుడు ఈ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.