BigTV English

Deepika padukone: వైరల్ అవుతోన్న కూతురి ఫొటోలు.. స్పందించిన దీపికా

Deepika padukone: వైరల్ అవుతోన్న కూతురి ఫొటోలు.. స్పందించిన దీపికా

Deepika padukone fired on deep fake photos of her child: ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న తారలలో దీపిక పదుకునె ఒకరు. తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకునె. అయినా తండ్రిలా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కాకుండా సినిమా రంగాన్ని తన కెరీర్ గా మలుచుకుంది. కాలేజీలో చదువుతున్నప్పుడే పలు మోడలింగ్ సంస్థలు దీపిక వెంట పడ్డాయి. డెన్మార్క్ లో పుట్టిన దీపిక బెంగళూరులోనే స్థిరపడింది. 2006లో విడుదలైన ఐశ్వర్య అనే ఓ కన్నడ మూవీ ద్వారా తన సినీ కెరీర్ ఆరంభించింది. బాలీవుడ్ లో ఓం శాంతి ఓం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరో. ట్రిపుల్ ఎక్స్ విన్ డీజిల్ అనే హాలీవుడ్ మూవీలో నటించింది. రాణి పద్మావత్ గా చారిత్రాత్మక పాత్రలో మెప్పించింది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను వివాహమాడింది. పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తోంది.


కల్కి మూవీలో తల్లిగా..

రీసెంట్ గా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ నటించిన కల్కి మూవీలో కల్కిని కనబోయే తల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఆ మూవీకి అంతర్జాతీయ ప్రశంసలతో బాటు అత్యధిక వసూళ్లు కూడా వచ్చాయి. దాదాపు రూప.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీపిక పదుకునే పేరు కూడా మార్మోగిపోయింది. ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. అయితే ఆ మూవీలో గర్భవతిగా చేసిన దీపిక అదే సమయంలో నిజజీవితంలోనూ ప్రెగ్నెంట్. అయితే 2018లోనే స్టార్ హీరో రణవీర్ స ింగ్ వివాహం జరిగినా..నాలుగేళ్ల తర్వాత తాము తల్లిదండ్రులవుతున్నామని తెలిపారు. రీసెంట్ గా దీపిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్ స్టా వేదికగా ఈ దంపతులు తమ అభిమానులకు తెలియజేశారు. దానితో నెటిజన్స్ అంతా ఈ జంటకు పుట్టిన పాప దీపికను మించిన నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని..అంతర్జాతీయ వేదికలపై అద్భుతాలు చేయాలని మనసారా అభినందనలు తెలిపారు.


ఫేక్ ఫొటోలపై మండిపాటు

అక్కడి దాకా బాగానే ఉంది..మరి కొందరు ఉత్సాహవంతులు దీపిక కూతురు అంటూ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా ముందుకు వదిలారు. దీనితో క్షణాలలో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అందరూ ఎంత క్యూట్ గా ఉందో బేబీ..జూనియర్ దీపిక అంటూ రిప్లై ఇస్తున్నారు. అయితే ఇదంతా చూసి చిర్రెత్తిన దీపిక పదుకునె సీరియస్ అయ్యారు. అసలు తమ ప్రమేయం లేకుండా ఆ ఫొటోలను ఎవరు షేర్ చేశారు? ఆ ఫొటోలో కనిపించే పాప మా పాప కాదు..దయచేసి ఇలాంటి ఫేక్ ఫొటోలను ఎంకరేజ్ చెయ్యకండి..ఈ మధ్య కొత్తగా పెరిగిన ఏఐ టెక్నాలజీని వాడి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లుగా క్రియేట్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనితో ఫేక్ ఫొటోలను పెట్టి తమని మభ్యపెట్టిన ఆకతాయిలపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు. తమ అమూల్యమైన సమయాన్ని ఇలా ఫేక్ ఫొటోల ద్వారా వెచ్చించాల్సి వచ్చిందని..అలాంటి ఆకతాయిలకు బుద్దిచెప్పాలని సోషల్ మీడియా వేదికగా వారిపై మండిపడుతున్నారు.

Related News

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Big Stories

×