Big Stories

Toyota’s Woven City: కలల ప్రపంచం వోవెన్.. ఫ్యూచర్ సిటీ విశేషాలు..

Special Story of Toyota’s Woven City: వోవెన్ సిటీ.. ఎక్కడో జపాన్‌లో ప్రస్తుతం అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న సిటీ ఇది. ఏంటి బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్ అన్నట్టు.. సిటీ కన్‌స్ట్రక్షన్‌ ఏంటి అనుకుంటున్నారా? యస్.. జపాన్‌లో ఓ సిటీనే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కూడా అలా ఇలా కాదు.. ప్రపంచం మొత్తం అటువైపే చూసేలా..ఇంతకీ ఏంటీ ఈ సిటీ స్పెషాలిటీ? మనం డిస్కస్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది? స్మార్ట్ సిటీ.. మన నేతల ఎన్నికల ప్రచారాల్లో చాలా ఎక్కువగా వినిపించే పేరు.

- Advertisement -

కానీ టయోటా మన నేతల్లా మాటలు చెప్పలేదు.. ఏకంగా ఆచరణలో పెట్టేసింది. ఈ సిటీ కాన్సెప్ట్ ఏంటంటే.. అప్పుడేప్పుడో ఆదిత్య 369లో బాలకృష్ణ ఫ్యూచర్‌కు వెళ్లినప్పుడు కనిపించే సీన్స్ కావొచ్చు. లేదంటే మనం హాలీవుడ్ మూవీస్‌లో చూపించి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కావొచ్చు. ఇప్పుడు దీనిని నిజంగా మన కళ్ల ముందు ఆవిష్కృతం చేసే కాన్సేప్టే ఇది. సింపుల్‌గా చెప్పాలంటే టయోటా వోవెన్ సిటీ అనేది భవిష్యత్తును మన కళ్ల ముందు ఉంచేది అనే చెప్పాలి..

- Advertisement -

జపాన్‌లోని ఫుల్ యాక్టివ్‌గా ఉన్న మౌంట్ ఫుజికి అతి దగ్గరలో 175 ఎకరాల విస్తిర్ణంలో నిర్మిస్తున్నారు ఈ సిటీని. ఆటోమెటిక్ డ్రైవింగ్ వెహికల్స్.. రోబోటిక్స్‌.. AI సాయంతో ఈ నగరం నిర్మితమవుతున్నది. ఇక్కడ రోడ్స్‌ నార్మల్‌గా ఉండవు.. కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. డ్రైవర్ లేని కార్లు.. ఉండే ఇళ్లు, వెహికల్స్, మనుషుల మధ్య కనెక్షన్‌ ఉండేలా AI టెక్నాలజీతో నిర్మించడం.. ఇలా ప్రతి విషయంలో టెక్నాలజీని ఇన్‌వాల్వ్‌ చేస్తున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు ఇందులో టెస్ట్ చేయడం.. మరింత డెవలప్ చేయనున్నారు. ఈ సిటీలో హైడ్రోజన్‌ బేస్‌డ్ టెక్నాలజీతో వెహికల్స్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడే నిర్మించే ఇళ్లు కూడా స్మార్ట్‌గా ఉండనున్నాయి. ప్రతి ఇంట్లో స్పెషలైజ్‌డ్ సెన్సార్స్‌ను ఏర్పాటు చేయనున్నారు..
ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో లివింగ్ లెబోరెటరి.

Also Read: ‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. మద్యానికి బానిసయ్యా’: జో బైడెన్

2021లో స్టార్ట్‌ అయిన వోవెన్ సిటీ నిర్మాణం ప్రస్తుతం దాదాపుగా పూర్తైంది. మొదట 360 మందిని ఇందులో ఉంచనున్నారు.. అయితే వీరంతా టయోటా ఎంప్లాయిసే.. ఆ తర్వాత ఈ కౌంట్‌ను మెల్లిమెల్లిగా 2 వేలకు పెంచనున్నారు. దీన్ని ఓ మాస్ హ్యూమన్ ఎక్స్‌పరిమెంట్‌ అని కూడా కొందరు చెబుతున్నారు. అయితే ఈ మొత్తం విషయంపై కంపెనీ ఎక్స్‌ప్లనేషన్‌ కాస్త డిఫరెంట్‌గా ఉంది. ఓ సిటీని బేస్‌ నుంచి నిర్మించడం అనేది ఓ పెద్ద టాస్క్.. కానీ మేము ఈ టాస్క్‌ను మొదలుపెట్టాం.. అయితే ఇలా జీరో నుంచి మొదలు పెట్టడం వల్ల ఫ్యూచర్‌ టెక్నాలజీస్‌ను ఉపయోగించగలుగుతున్నాం. సిటీ ఇన్‌ఫ్రాస్టక్షర్‌లో డిజిటల్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కూడా ఇన్‌క్లూడ్ చేయగలిగాం అని చెబుతున్నారు టయోటా ప్రతినిధులు..

మరి వోవెన్ సిటీ నిర్మానానికి ఎంత ఖర్చ అవుతుంది? దీనికి ఆన్సర్ 8 బిలియన్లు.. అంటే దాదాపు 83 వేల కోట్ల రూపాయలు. మరి ఓ ప్రైవేట్ కంపెనీ ఏ లాభం లేకుండా ఇంత డబ్బును ఎందుకు ఖర్చు పెడుతుంది? ఏ కంపెనీ అయినా ఊరకనే ఖర్చు చేయదు కదా.. ఏదో ఒక లాభం ఆశిస్తేనే కదా రంగంలోకి దిగేది. అయితే తాము మాత్రం మనుషుల జీవన విధానం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ల సంగమంతో ఈ నగరాన్ని నిర్మించాలన్నదే తమ లక్ష్యమని చెబుతోంది టయోటా.. కానీ ఈ సిటీలో చేసే ప్రతి పని ఓ ప్రయోగమే.. కొత్త టెక్నాలజీలను ఇక్కడ మనుషులపై ఫస్ట్ ట్రయల్స్‌ చేయనున్నారు. దాని రెస్పాన్స్‌ను క్యాలుక్లేట్ చేసి దానిలో మార్పులు చేర్పులు చేసి దానిని ప్రపంచంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఫర్ ఎగ్జాంపుల్.. హైడ్రోజన్‌ బేస్‌డ్‌ ఆటోమొబైల్స్.. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి కర్బన ఉద్గారాల బాధ ఉండదు.

Also Read: ఈ 20 ఏళ్లలో అన్నీ మారాయి.. ఆ ఒక్కటి తప్ప: సుందర్ పిచాయ్

ఈ టెక్నాలజీని రియల్‌ టైమ్‌లో మరింత అభివృద్ధి చేసేందుకు ఈ సిటీ ఉపయోగపడనుంది. ఎట్ ది సేమ్ టైమ్.. AI టెక్నాలజీ.. ప్రస్తుతం AI అన్నింట్లో ఉపయోగించవచ్చని చదువుతున్నాం. కానీ ఈ సిటీలో రియల్‌టైమ్‌లో దానిని ప్రజలు ఉపయోగించనున్నారు. ఇందులో లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకొని అప్‌డేట్ చేసుకోవచ్చు. డ్రైవర్ లెస్ కార్ల పనితీరును కూడా ఫుల్‌ ఫ్లెడ్జ్‌లో తెలుసుకోనున్నారు. అంతేకాదు రోడ్లను ఉపయోగించడంలో.. ట్రాఫిక్‌ కంట్రోల్‌లో టెక్నాలజీని మరింత ఇన్‌వాల్వ్‌ చేయనున్నారు.

అంతేకాదు ఈ సిటీలో రోబోల సేవలు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక్కడ నివసించే వారి హెల్త్ డేటా కూడా ఎప్పటికప్పుడు ఆటోమెటిక్‌గా అప్‌డేట్ కానుంది. ఏదైనా సమస్య రావడానికి ముందే పసిగట్టే వ్యవస్థను కూడా ఇక్కడ డెవలప్‌ చేస్తున్నారు.. అయితే జపనీస్ ఎంత టెక్నాలజీ ఉపయోగించినా.. వాళ్ల సంస్కృతిని మాత్రం మర్చిపోరన్నది మనకి తెలిసిందే. అందుకే ఇక్కడ నిర్మించే అన్ని నిర్మాణాల్లో జపాన్ నిర్మాణశైలి, సాంప్రదాయం కనిపించనుంది. ఇలా హెరిటేజ్ అండ్ టెక్నాలజీల సంగమమే వోవెన్ సిటీ ఫ్యూచర్‌లో జరిగే అనేక మార్పులకు ఈ సిటీ కేరాఫ్ కానుందన్న గట్టి నమ్మకంతో ఉంది టయోటా.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News