BigTV English

VarunTej in Pithapuram: ఏమీ లేకుండానే పవన్ సాయం, అదే చట్ట సభలకు వెళ్తే..

VarunTej in Pithapuram: ఏమీ లేకుండానే పవన్ సాయం, అదే చట్ట సభలకు వెళ్తే..

VarunTej in Pithapuram: నాగబాబు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌తేజ్ తొలిసారి పొలిటికల్ స్పీచ్ అదరగొట్టాడు. ఎక్కడ తడుముకోకుండా చెప్పాల్సిన నాలుగు మాటలను ఓటర్ల మనసులోకి సూటిగా వెళ్లేలా చేశాడు వరుణ్‌తేజ్.


తనవద్ద ఏమీ లేకుండా అప్పులు చేసి మరీ కౌలు రైతులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సాయం చేశారన్నాడు వరుణ్. అదే ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారని చెప్పాడు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించలేకపోయినా, ఆయన ప్రజలకు మేలు చేస్తున్నారని గుర్తు చేశాడు. ఈసారి చట్టసభలకు పంపాలని ఓటర్లను కోరాడు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో హీరో వరుణ్‌‌‌‌తేజ్ ఎన్నికల ప్రచారం చేపట్టాడు. గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించాడు. పిఠాపురం ప్రజలను తన కుటుంబసభ్యులుగా పవన్ భావిస్తున్నారని, నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్నీ అభివృద్ధి చేస్తారన్నాడు. చిరంజీవి సహా మా కుటుంబం మొత్తం పవన్ బాబాయ్ వెనుకే ఉందన్నాడు. గాజు గ్లాసు గుర్తును చూపిస్తూ పవన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరాడు.


ALSO READ: ఎవరి మానిఫెస్టో దమ్మెంత? టీడీపీ Vs వైసీపీ

అంతకుముందు పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర‌స్వామి, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకున్న వరుణ్ తేజ్, ప్రత్యేకంగా పూజలు నిర్వహించాడు. ఆ తర్వాత తాటిపర్తి, కొడవలి, చెందుర్తి గ్రామాల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డు షోలో పాల్గొన్నారు. దుర్గాడలో నిర్వహించిన సభలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

 

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×