E-Paper
Advertisement

హైదరాబాద్ – అమరావతి – చెన్నై బుల్లెట్ రైలు.. పరిశీలనలో 18 స్టేషన్లు.. ఇందులో మీ ఊరు ఉందా?

హైదరాబాద్ – అమరావతి – చెన్నై బుల్లెట్ రైలు.. పరిశీలనలో 18 స్టేషన్లు.. ఇందులో మీ ఊరు ఉందా?
Advertisement

Bullet Train: దక్షిణ భారత రైల్వేలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘హైదరాబాద్-అమరావతి-చెన్నై’ బుల్లెట్ రైలు కారిడార్‌ను ప్రతిపాదించింది. కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్.. 3 సరిహద్దు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

ఏ రాష్ట్రానికి ఎంత పరిధి?

సుమారు 760.09 కిలోమీటర్ల పొడవునా నిర్మించే ఈ హైస్పీడ్ రైలు మార్గంలో అత్యధిక భాగం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండనుంది. ఏపీ పరిధిలో 518.54 కిలోమీటర్లు, తెలంగాణలో 180.32 కిలోమీటర్లు, తమిళనాడులో 61.23 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉండగా.. రూట్ అలైన్‌మెంట్, భూసేకరణ, నిధుల సమీకరణ, నిర్మాణ ప్రణాళికలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

18 స్టేషన్లు.. ఏఏ ప్రాంతాల్లో అంటే?

Advertisement

ఈ కారిడార్‌లో మొత్తం 18 రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. తెలంగాణ 6 ఉండగా.. అందులో హైదరాబాద్, శంషాబాద్, భారత్ సిటీ/ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్ట్, హాలియా, వడపల్లి పరిశీలిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ (9) నుంచి దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి పరిశీలనలో ఉన్నాయి. అటు తమిళనాడులో తిరువళ్లూర్, చెన్నై ఔటర్ రింగ్ రోడ్, చెన్నై సెంట్రల్ స్టేషన్లను బుల్లెట్ రైలు పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అమరావతికి కనెక్టివిటీ

బుల్లెట్ రైలు కారిడార్‌లోకి అమరావతిని చేర్చడం ఆ ప్రాంత అభివృద్ధికి మరింత బూస్టమ్ ఇస్తుందని ఏపీ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఆ దిశగా అడుగులు వేస్తుండటం శుభపరిణామమని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR), సర్వే పనులు జరుగుతున్నాయి.

12 గంటల ప్రయాణం.. 2 గంటల్లోనే!

Advertisement

ఈ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే ప్రయాణ వేగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం సాధారణ రైళ్లలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుండగా.. బుల్లెట్ రైలు ద్వారా ఈ సమయం కేవలం 2 గంటల 20 నిమిషాలకు తగ్గిపోనుంది. దీనివల్ల వ్యాపార, పర్యాటక రంగాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఒకే రోజులో వ్యాపార పనులు ముగించుకుని తిరిగి వచ్చే అవకాశం ప్రయాణికులకు దక్కుతుంది.

Also Read: అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

రియల్ ఎస్టేట్, పరిశ్రమలకు బూస్ట్

మరోవైపు హైస్పీడ్ రైలు కారిడార్ రాకతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, వాణిజ్య రంగాలు పుంజుకోనున్నాయి. తెలంగాణలోని శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, హాలియా ప్రాంతాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలు ఆర్థిక కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. తమిళనాడులోని ఉత్తర చెన్నై, తిరువళ్లూర్ ప్రాంతాలకు కూడా ఇది రవాణా పరంగా ఎంతో కలసి రానుంది.

Also Read: ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? రచ్చలేపిన జర్నలిస్ట్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన పాక్ ఆర్మీ!

Tags

Related News

ప్రపంచంలో వింతైన రైళ్లు.. వీటి ప్రయాణం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలు.. ఈ 5 రూట్లు అస్సలు మిస్ కావొద్దు!

భారతీయ రైల్వేలో అత్యంత ఎత్తైన స్టేషన్ ఇదే.. హైట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్.. అక్కడ అడుగు పెడితే అస్సలు రావాలి అనిపించదు!

పొల్లూరు జలపాతం ఉగ్రరూపం.. కుప్పకూలిన ‘ఇరుముడి’ చెక్క వంతెన!

నదీ జలాలు.. సముద్రపు అలలు.. అడవి మధ్యలో బోటింగ్.. అంతర్వేది అందాలు చూస్తే మైమరచిపోతారు!

రైలు ఆపారు.. సాయం కోరారు.. గంట గడిచినా పత్తాలేని అంబులెన్స్!

రాముడు, కృష్ణుడు నీలం రంగులో ఎందుకు కనిపిస్తారు? అసలు వర్ణం నలుపు కాదా?

Big Stories

Advertisement
×