E-Paper
Advertisement

మేడిగడ్డ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌కు మళ్లీ సమన్లు జారీ చేసిన జిల్లా కోర్టు!

మేడిగడ్డ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌కు మళ్లీ సమన్లు జారీ చేసిన జిల్లా కోర్టు!
Advertisement

KCR: స్వేచ్ఛ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.

కేసు నేపథ్యం.. హైకోర్టు కీలక ఆదేశాలు

Advertisement

గతంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో, నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీనిపై విచారణ కమిషన్ కూడా వేసింది. అయితే, పిటిషనర్ రాజలింగమూర్తి ఇటీవల మరణించారు. అయినప్పటికీ, ఇది ప్రజాధనానికి సంబంధించిన అంశం కాబట్టి విచారణను నిలిపివేయకుండా ముందుకు తీసుకెళ్లాలని, వివాదాన్ని జిల్లా కోర్టు పరిధిలోనే తేల్చాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

మళ్లీ నోటీసులు ఎందుకంటే?

Advertisement

హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు గతంలో కేసీఆర్‌కు సమన్లు జారీ చేసింది. అయితే, ఆ నోటీసులు ఆయనకు సరిగ్గా అందలేదని తేలడంతో, ఈసారి పక్కాగా అందజేయాలని న్యాయస్థానం జిల్లా న్యాయవాదిని ఆదేశిస్తూ మళ్లీ సమన్లు ఇచ్చింది. ఈ క్రమంలోనే అధికారులు హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు.

కోర్టులో ఉత్కంఠ.. సెప్టెంబర్ 9కి వాయిదా

బుధవారం విచారణ సమయంలో కోర్టు ఏదైనా తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉందనే ప్రచారంతో కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధులు, మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయమూర్తి, తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Also Read: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్

Tags

Related News

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×