Big Stories

YS Viveka Murder Case: వివేకా మర్డర్ ఆ పార్టీలకు పొలిటికల్ వెపన్..!

Andhra Leaders Using YS Viveka incident As Weapon

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి, సీఎం వైఎస్‌ జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డిని.. 2019 మార్చి 15న తెల్లవారుజామున అత్యంత దారుణంగా మర్డర్ చేశారు. ఆ రోజు మొదలైంది రాజకీయ రచ్చ.. అప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వమే హత్య చేయించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత సీన్‌లోకి సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. వివేకాను నరికి చంపిన దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ఎంపీ అవినాష్‌ రెడ్డితో పాటు ఆయన తండ్రి కనుసన్నల్లోనే.. హత్య జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు..

ప్రస్తుత విపక్ష పార్టీలకు ఈ హత్య ఉదంతం ఆయుధమైంది. బాబాయినే చంపేశారంటూ జగన్‌ అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. వివేకా కూతురు సునీత కూడా అన్నలనే టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ ఏపీ చీఫ్‌గా ఉన్న షర్మిల కూడా.. జగన్‌, అవినాష్‌ రెడ్డిలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. ఇది సింపుల్‌గా కేసు బ్రీఫింగ్.

సరిగ్గా ఇదే సమయంలో ప్రొద్దుటూరు సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఈ వ్యవహారాన్ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేశాయి.. చిన్నాన్ను అతి దారుణంగా చంపారు. వాళ్లేవరో ఆ దేవుడికి, ప్రజలకు తెలుసు. చంపిన వాడు బలాదూర్‌గా బయట తిరుగుతున్నాడు.. అతడికి మద్దతు ఎవరిస్తున్నారు.. చంద్రబాబు కాదా.. నా చెల్లెళ్లను కూడా వెంట తీసుకొచ్చారు. ఇలా సాగిపోయింది సీఎం జగన్ స్పీచ్.. వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. వాళ్లను సీఎం జగన్ రక్షిస్తున్నారు. ఇది వైఎస్ సునీతా, వైఎస్ షర్మిలా, టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్న మాట.

Also Read: బిగ్ అలర్ట్‌.. అస్సలు బయటకు రాకండి.. నేడు రాష్ట్రంలో భారీగా వడగాడ్పులు..

ఇలా ఎవరి వాదన వారిది. ఎవరి అస్త్రాలు వారివి.. కానీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వివేకాను గొడ్డలితో అత్యంత దారుణంగా హత్య చేశాడు దస్తగిరి.. ఇది విచారణలో తానే ఒప్పుకొని అప్రూవర్‌గా మారాడు.. ఇప్పుడు బెయిల్‌పై బయటే ఉన్నాడు. ఎవరు చెప్తే చంపారన్నది పక్కన పెడితే.. చంపింది మాత్రం తనే.. కానీ ఇప్పుడు బయటే ఉన్నాడు. ఇదే సీఎం జగన్‌ చెప్పారు.. ఇది నిజమే. కానీ పూర్తిగా కాదు. దస్తగిరి చెప్పింది చేశాడు.. కానీ వివేకాను చంపాలని చెప్పింది అవినాష్‌ రెడ్డి  ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి.. ఇదీ సీబీఐ చేబుతున్న విషయం.. మరీ అలాంటి నిందితుడిని పక్కన పెట్టుకొని జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అనేది ఇప్పుడు టీడీపీ నేతలు వేస్తున్న ప్రశ్న.

ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఓ కన్‌క్లూజన్‌కు వచ్చిందా? అసలు దర్యాప్తు ఎక్కడికి వచ్చింది? సీబీఐ ఇన్నాళ్ల విచారణలో తేలిందేంటి? అంటే సరైన సమాధానాలు లేవనే చెప్పాలి. సీబీఐ అనుకున్నంత వేగంగా ఈ కేసులో దర్యాప్తు చేయలేదు. ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా ఈ ఏజెన్సీ ఓ కన్‌క్లూజన్‌కు రాలేకపోయింది. అనేక మందిని విచారించింది. భాస్కర్‌ రెడ్డిని పలుసార్లు విచారించి.. అరెస్ట్ కూడా చేసింది. అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో అరెస్ట్ చేయలేకపోయింది. కానీ విచారణ మాత్రం జరిపింది. కానీ ఈ కేసు ఇప్పటికీ కూడా తుదిదశకు రాలేదు. మరి ఇంకెన్నాళ్లు దర్యాప్తును సాగదీస్తారు..? విచారణను అడ్డుకుంటున్నదెవరు? అన్నది మాత్రం తేలడం లేదు. కాని పొలిటికల్ హైడ్రామా మాత్రం నెలకొంది.

Also Read: ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు బ్యాంకు ఖాతాల స్తంభన.. ఏం జరుగుతోంది?

రాయలసీమ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు బాబాయి-అబ్బాయి హత్యపైనే మాట్లాడుతున్నారు. కడప ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల కూడా.. ఇదే అంశంలో అన్నపై తీవ్ర విమర్శలు చేస్తూ.. బరిలోకి దిగుతోంది. ఇక వైఎస్‌ వివేక కూతురు సునీతా కూడా.. పులివెందుల బరిలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా జగన్‌ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించవద్దు. మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. న్యాయం జరగదని తేల్చి చెబుతున్నారు. కానీ జగన్‌ ఏమో.. చంద్రబాబుదే పాపమంటున్నారు.

మొత్తానికి వివేకా హత్య కేసు విచారణ ముందుకు కదలకుండా అక్కడే ఉన్నా.. రాజకీయంగా మాత్రం రోజు ట్విస్ట్‌తో సాగుతోంది. మరి ఈ అంశం ఓటర్లను ఎంత మేరకు ప్రభావితం చేస్తోంది..
ఎన్నికలను ఏ రేంజ్‌లో ప్రభావితం చేస్తుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News