Big Stories

Prathinidhi 2 Teaser: ఇప్పటికైనా ఒళ్లు విరిచి. భయటకొచ్చి ఓటు వేయండి.. లేదంటే చచ్చిపోండి.. నారా రోహిత్ ‘ప్రతినిధి2’ టీజర్..

Prathinidhi 2:
Prathinidhi 2:

Nara Rohit’s Prathinidhi 2 Movie Teaser Released: టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన హీరో నారా రోహిత్. బాణం, సోలో, ప్రతినిధి, అసుర వంటి సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో ‘ప్రతినిధి’ సినిమాతో వచ్చి అందరినీ అలరించాడు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ప్రతినిధి 2’ మూవీతో మెప్పించడానికి సిద్ధమయ్యాడు.

- Advertisement -

ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఒక చిన్న కాన్సెప్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -

ఈ టీజర్‌లో ఎక్కువగా పొలిటికల్ అంశాలనే ఎక్కువగా చూపించారు. రాష్ట్ర అప్పు, అభివృద్ధి వంటి సీన్లను కట్ చేసి చూపించారు. ఇక చివర్లో వచ్చే డైలాగ్ అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు టీజర్ పూర్తి రివ్యూ చూసేద్దాం..

టీజర్ ప్రకారం.. మొదట్‌లోనే ఒక ఇళ్లు బ్లాస్ట్ అయినట్లు చూపించారు. రక్తంతో తడిసిన హ్యాండ్, పోలీసులు ఇన్విస్టిగేషన్ చేస్తున్న ఒక ఇళ్లు, రాజకీయ పార్టీ సమావేశం చూపించారు. ఆ తర్వాత హీరో నారా రోహిత్ ఎంట్రీ.. ఆపై ఓ రాజకీయ నాయకుడు ‘జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలోనే బతికే ఉంటాం’ అంటూ చెప్పిన డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read: పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్.. ఒరిజినల్ ఎవరో గుర్తుపట్టండి

అనంతరం రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించిన కొన్ని సీన్లను కట్ చేసి చూపించారు. అయితే ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పించాయనే చెప్పాలి. నారా రోహిత్ ఒక రాజకీయ నాయకుడిని లైవ్‌లో ఇంటర్వ్యూ చేస్తారు. అందులో రోహిత్ ఆయన్ను ప్రశ్నిస్తూ.. మన రాష్ట అప్పు ఎంత ఉంటుంది సార్ అని అంటాడు.

సుమారు ఓ 5లక్షల కోట్లు ఉంటుందని అంటాడు ఆ రాజకీయ నాయకుడు. ఆ 5 లక్షల కోట్లు తీర్చాలంటే ఎంతటైం పడుతుందని అడగ్గా.. అభివృద్ది ఉంటే అదెంత సేపు అబ్బా అని అంటాడు. అయితే అభివృద్ధి ఎక్కడుంది సార్ అని వచ్చే డైలాగ్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Also Read: విశ్వక్‌సేన్‌ బర్త్‌ డే స్పెషల్‌.. ఈ రోజు రాబోతున్న కొత్త సినిమా అప్డేట్లు ఇవే..

ఆ తర్వాత యాక్షన్ సీన్‌ను చూపించారు. ఇక చివరిగా.. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. ఒళ్లు విరిచి బయటకొచ్చి ఓటు వేయండి.. లేదంటే దేశం వదిలి వెళ్లిపోండి.. అదీ కుదరకపోతే చచ్చిపోండి అంటూ రానా రోహిత్ డైలాగ్ డెలివరితో మరో లెవెల్‌ అంచనాలు పెరిగిపోయాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News