BigTV English

Chiranjeevi: తల్లి ఆరోగ్యంపై స్పందించిన చిరు.. ఏమన్నారంటే?

Chiranjeevi: తల్లి ఆరోగ్యంపై స్పందించిన చిరు.. ఏమన్నారంటే?

Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) తల్లి అంజనా దేవి (Anjana Devi) అస్వస్థత కు గురైనట్లు ఈరోజు ఉదయం నుంచి వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. అంజనా దేవి అస్వస్థతకు గురయ్యారని, ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారని వార్తలు వినిపించాయి. అంతేకాదు తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విజయవాడలో జరగాల్సిన ఒక కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని మ రీ హైదరాబాద్ కి వచ్చారు అంటూ వార్తలు వైరల్ చేశారు. తాజాగా ఈ వార్తలు వదంతులు లాగా వినిపిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ వార్తలను ఖండిస్తూ తాజాగా ఒక ట్వీట్ వేశారు.


తల్లి ఆరోగ్యం పై స్పందించిన చిరంజీవి..

“మా అమ్మ అస్వస్థతగా ఉంది అని, ఆసుపత్రిలో చేరిందని కొన్ని మీడియా కథనాలు నా దృష్టికి వచ్చాయి. గత రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థతకు గురైంది. ఆసుపత్రిలో చేరిందని అంటున్నారు. దీంతో మా అభిమానులు, శ్రేయోభిలాషుల అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మీడియాకు నేను ఒక విన్నపం చేయాలనుకుంటున్నాను. ఆమె చాలా ఆరోగ్యంగా, హుషారుగా ఉన్నారు. దయచేసి ఆమె ఆరోగ్యం పై ఎలాంటి ఊహాజనిత వార్తలను ప్రచురించవద్దు. ముఖ్యంగా అన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని గమనించగలరు” అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. మొత్తానికైతే అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టడంతో చిరంజీవి వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.


మెగాస్టార్ చిరంజీవి సినిమాలు..

మెగాస్టార్ చిరంజీవి.. ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vasista mallidi) దర్శకత్వంలో విశ్వంభర(Vishwambhara) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. ఇక ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ కోసం ప్రస్తుతం ఉన్న టీమ్ ను తొలగించి.. ‘కల్కి’ సినిమా కోసం పనిచేసిన టీంను రంగంలోకి దింపబోతున్నారు చిరంజీవి. ముఖ్యంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) పర్యవేక్షణలో ఈ సినిమా వీఎఫ్ఎక్స్ రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య మే నెలలో సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సరైన సక్సెస్ కోసం గత కొంతకాలంగా ఎదురు చేస్తున్న చిరంజీవికి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా చిరంజీవికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇప్పటికే చిరంజీవి తరం హీరోలైన వెంకటేష్(Venkatesh), బాలకృష్ణ (Balakrishna) వరుస హిట్లు అందుకుంటూ దూకుడు మీద ఉన్నారు. అటు నాగార్జున (Nagarjuna) మాత్రం హీరోగా ప్రయత్నం చేయకుండా స్టార్ హీరోల సినిమాలలో కీ రోల్ పోషిస్తున్నారు. మరి ఇప్పుడు చిరంజీవి విశ్వంభరతో సక్సెస్ కొట్టడం అత్యంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×