E-Paper
Advertisement

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి
Advertisement

AP DSC Notification-2026: ఏపీలో ఉద్యోగాల జాతర కంటిన్యూ అవుతోంది. తాజాగా నిరుద్యోగ యువతకు మరో తీపి కబురు చెప్పింది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ-2026 నోటిఫికేషన్‌ మంగళవారం విడుదల చేసింది. ఈసారి 2721 టీచర్‌ పోస్టులు భర్తీ చేయనుంది.

ఏపీలో నిరుద్యోగులుల ఫుల్‌జోష్

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ ఏడాది ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుడుతోంది కూటమి ప్రభుత్వం. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ-2026 పేరిట కొత్తగా నోటిఫికేషన్‌ మంగళవారం విడుదల చేసింది. ఈ దఫా 2721 టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తుంది ప్రభుత్వం. నవంబర్‌ 3 నుంచి ఆన్‌లైన్‌‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. APPSC ద్వారా 1466 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 10 ప్రాథమిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా విద్యాశాఖ ద్వారా మరో 2721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటన ఇచ్చింది. దీంతో నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది.

2721 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ ప్రకటన

Advertisement

జనరల్‌ పాఠశాలలు, ప్రత్యేక విద్యా విభాగం, వివిధ రకాల విద్యా సొసైటీల పరిధిలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనుంది. జనరల్‌ పాఠశాలల్లో 2111 పోస్టులు ఉన్నాయి. ప్రత్యేక విద్యా విభాగం-350, విద్యా సొసైటీల పరిధి-260 పోస్టులు ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌, ప్రిన్సిపాల్‌, పీజీటీ, టీజీటీ, ఫిజికల్‌ డైరెక్టర్‌, పీఈటీ పోస్టులను భర్తీ చేయనుంది. నవంబరు 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలుకానుంది.

వచ్చే నెల రెండు నుంచి అప్లికేషన్ స్వీకరణ

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి ఖాళీల సంఖ్య, రిజర్వేషన్లు, విద్యార్హతలు, వయో పరిమితి వంటి సమగ్ర సమాచారంతో పూర్తి స్థాయి నోటిఫికేషన్లను విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. డీఎస్సీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో కంప్యూటర్‌ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీలు నోటిఫికేషన్‌లో ప్రకటించనుంది. జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తుల చివరి తేదీ, హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌, సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.

Advertisement

ALSO READ: ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రిజర్వేషన్లు.. కీలక నేతలు జిల్లాలైతే..

పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక డీఎస్సీ వెబ్‌సైట్‌ https://tet2dsc.apcfss.in ను సందర్శించవచ్చు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్-906, ఎస్జీటీ- 1,205 కలిపి మొత్తం 2111 ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయి. ప్రత్యేక విద్య కేటగిరి కింద ప్రభుత్వం, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ పాఠశాలల్లో 350 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో స్కూల్ అసిస్టెంట్-150, ఎస్జీటీ-200 పోస్టులు ఉన్నాయి. రెసిడెన్షియల్ సొసైటీలు- ఇతర యాజమాన్యాలకు సంబంధించి పోస్టులు ఈ విధంగా ఉన్నాయి.

ఇక 260 పోస్టులకు సంబంధించి ప్రిన్సిపల్-30, పీజీటీ-81, టీజీటీ-113, పీడీ-2, పీఈటీ-34 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ పోస్టుల్లో అన్ని విభాగాలు కలిపి చూస్తే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 404 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ప్రకాశం జిల్లా-291, కడప జిల్లా-227 పోస్టులు ఉన్నాయి. తక్కువగా పార్వతీపురం మన్యం జిల్లా-15, విజయనగరం-18, పశ్చిమగోదావరి-20 ఖాళీలు ఉన్నాయి.

Related News

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రిజర్వేషన్లు.. కీలక నేతలు జిల్లాలైతే..

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?

బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. ఈ అంశాలపై కీలక చర్చ!

విశాఖ మేయర్ పీఠం కోసం తీవ్ర ఉత్కంఠ పోరు.. టీడీపీ, వైసీపీలో వినిపిస్తున్న పేర్లు ఇవే?

రాజమండ్రి మున్సిపల్ మేయర్ ఆశావహులకు బిగ్ షాక్.. తలకిందులైన లెక్కలు!

రోడ్లు, బ్రిడ్జి కోసం మెడకు ఉరి వేసుకుని నిరసన తెలిపిన గ్రామస్తులు.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×