Brahmamudi serial today Episode: లక్కీ తాళి కట్టబోయే ముందు ఐశ్వర్య ఆపేస్తుంది. తాళి కట్టొద్దు అంటూ లక్కీని తోసేస్తుంది. ఎందుకు ఆపేస్తున్నావని అందరూ అడిగితే కంపెనీ పెట్టిస్తామని ఇందు మాటిచ్చింది పెళ్లికి ముందు అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తానని మాటిచ్చింది. కానీ ఇంత వరకు ఇవ్వలేదని అగ్రిమెంట్స్ ఇస్తేనే పెళ్లి అంటూ కరాకండిగా చెప్పేస్తుంది ఐశ్వర్య. ముహూర్తం దాటిపోతుందని పంతులు చెప్పినా వినకుండా ఈ ముహూర్తం పోతే ఇంకో ముహూర్తం అంతే కానీ అగ్రిమెంట్ పేపర్స్ లేనిదే పెళ్లి చేసుకోను అంటూ చెప్తుంది. తను అడిగింది ఏదో ఇవ్వొచ్చు కదా అని రేఖ చెబితే.. తీసుకొస్తాను ఉండు అంటూ ఇందు వెళ్లి పేపర్స్ తీసుకొచ్చి ఇస్తుంది. పేపర్స్ వచ్చాయి కదా పంతులు గారు తాళి కట్టించండి అంటూ లక్కీ అడగ్గానే..
ఆగు ఈ పేపర్స్ మొత్తం చూసి లీగల్గా ఎలా ఉందో తెలుసుకున్నాకే తాళి కట్టించుకుంటాను అంటుంది. అవి నీకు లీగల్గా ఎలా అర్థం అవుతుంది ఐషు అని శేషు అడిగితే ఒక్క నిమిషం ఆగండి అంటూ లాయరును పిలుస్తుంది. లాయరు వచ్చి పేపర్స్ చూస్తాడు. అంతా చెక్ చేసిన తరవాత లాయరు అంతా క్లియర్ గా ఉంది మేడం అని చెప్తాడు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్పగానే.. ఆ అయితే ఇక నువ్వు వెళ్లు లాయరు మేము చూసుకుంటాము అంటాడు శేషు. ఇప్పుడైనా తాళి కట్టించుకుంటావా ఐషు అని ఇందు అడిగితే.. ఐశ్వర్య లాయరును వెళ్లిపోమ్మని చెప్పి వెళ్లి లక్కీ పక్కన కూర్చుంటుంది. లక్కీ చేత పంతులు తాళి కట్టిస్తాడు. తర్వాత పంతులు దండలు మార్చుకోమని చెబితే పంతులుగారు పెళ్లి అయిపోయిందా..? అంటూ అడుగుతుంది ఐశ్వర్య ఐపోయిందని పంతులు చెబితే.. ఇక దండలు మార్చుకోవడం ఏంటి..? నేను వెళ్తున్నాను అంటూ లేచి వెళ్లి రేఖను ఆశీర్వదించమని ఆశీస్సులు తీసుకుని వెళ్లిపోతుంది అందరూ షాకింగ్గా చూస్తుంటారు.
తర్వాత స్వాతిని పక్కకు తీసుకెళ్లి ఇంత జరుగుతున్నా తనకెందుకు చెప్పలేదని అడుగుతుంది. ఈ అక్క ఉందని మర్చిపోయావా..? అంటే ఇంకా మీ దగ్గర హెల్ప్ తీసుకుంటే మేము ఇక్కడి నుంచి వెళ్లి ఏం లాభం అక్కా నువ్వేం వర్రీ అవ్వకు మేమ హ్యాపీగా ఉంటాము కదా అంటూ స్వాతి చెప్తుంది. పంతులు ఇంకా ఏవేవో ముహూర్తాలు చూస్తుంటే.. పెళ్లి అయిపోయాక ఇంకా ఏ ముహూర్తాలు చూస్తున్నారు అని భ్రమరాంబ అడిగితే.. పెళ్లి జరిగితే జరిగే తంతులు ఉంటాయి కదా వాటి కోసమే ముహూర్తం చూస్తున్నారు అంటూ ఇందు చెబితే.. అన్ని పెళ్లికి ముందే అయిపోయాయి కదా అంటూ భ్రమరాంబ వెటకారంగా మాట్లాడుతుంది. తర్వాత అందరూ కూర్చుని మాట్లాడుతుంటే.. చలపతి రాజును లక్కీ పెళ్లి అయిపోయింది ఇక రాజు మీరు పిల్లలను ఎప్పుడిస్తున్నారు అని అడుగుతాడు. అందుకు రాజు ఇందు పిల్లలు కావాలంది కానీ నేను వద్దన్నాను అంటూ చెప్తాడు. పిల్లల విషయంలో ఏదో ఒకటి ఆలోచించుకోవాలి కదా అంటూ లక్ష్మీ అడిగితే.. ఇందు అదేమీ పట్టించుకోకుండా పంతులు గారు ముహూర్తం దొరికిందా అని అడుగుతుది. పంతులు ముహూర్తం పెట్టి వెళ్లిపోతాడు.
స్వాతి వెళ్లిపోతుంటే.. రేఖ, భ్రమరాంబ, శేషు ఎమోషనల్ అవుతారు. రేఖ డబ్బులు ఇస్తుంటే.. చిల్లిగవ్వ కూడా ముట్టుకోవద్దని మదన్ చెప్పాడు అంటూ రేఖ ఇచ్చే డబ్బులు తీసుకోదు.. ఆలస్యం అయింది ఇక నేను బయలుదేరతాను అంటూ స్వాతి వెళ్లిపోతుంటే.. శేషు దగ్గరకు వెళ్లి బాధపడుతూ ఎమోషనల్ అవుతాడు.
ఇందు పాలు తీసుకుని వెళ్లిపోతుంటే.. రాజు కోసం పాలు తీసుకెళ్తున్నావా..? ఇందు అంటూ అపర్ణ అడగ్గానే.. ఆ రోజు త్వరలోనే రావాలని ఆశపడుతున్నాను నాన్నమ్మ అంటూ ఇవి ఐశ్వర్య కోసం తీసుకొచ్చాను అని చెప్తుంది. నువ్వు తీసుకొచ్చావు కానీ ఆ ఐశ్వర్య గంట ముందే వెళ్లి గదిలో కూర్చుంది అని అపర్ణ చెప్పగానే.. ఇందు షాక్ అవుతుంది. పాలు రాజుకు ఇవ్వగానే.. తీసుకెళ్లి లక్కీకి ఇచ్చి పాలు తీసుకుని గదిలోకి వెళ్లు అంటూ చెప్పగానే.. అదేంటి నేను పాలు తీసుకెళ్లడం ఏంటి అని అడిగితే.. ఐషు ఆల్రెడీ ఆ గదిలోకి వెళ్లిపోయింది నువ్వే పాలు తీసుకుని వెళ్లు అంటూ పంపిస్తాడు. గదిలోకి వెళ్లిన లక్కీని ఐశ్వర్య తిడుతుంది. తనను డిస్టర్బ్ చేయకుండా ఏదో ఒక మూలన పడుకో అంటుంది. నిన్ను తగలకుండా బెడ్ మీదే పడుకుంటాను అంటూ ఇద్దరి మధ్య పిల్లోస్ అడ్డుగా పెట్టి పడుకుంటాడు లక్కీ. దీంతో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.